Varanasi: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకధీరుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి, బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. మహేష్ బాబుతో ‘వారణాసి’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రపంచస్థాయి ప్రేక్షకులను మెప్పించడమే టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ను కంప్లీట్ చేసిన రాజమౌళి, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. వారణాసి మూవీలో టైం ట్రావెల్‌తో పాటు రామాయణంలోని కొన్ని పర్వాలను సైతం మిళితం చేసి కథను రాసుకున్నారు. రైటర్ విజయేంద్రప్రసాద్ రాసిన కథ చాలా అద్భుతంగా ఉందని, దానిని రాజమౌళి విజువల్ వండర్‌గా మలుస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
నిజానికి ఈ సినిమా టైం ట్రావెల్ కథతో తెరకెక్కుతోంది. కాబట్టి ఒక్కో సమయంలో ఒక్కో వ్యక్తి విలన్‌గా మారుతాడట. అలాగే ప్రజెంట్ జరిగే కథలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు మరో నటుడు కూడా విలన్‌గా కనిపిస్తాడట. ఆ పాత్ర ఎవరు చేస్తున్నారు అనేది ఎవరికీ తెలియదు. రాజమౌళి ఆ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచుతున్నాడు. ఇప్పటి వరకు రాజమౌళి చేసిన సినిమాలన్నింటిలో యాక్షన్ సన్నివేశాలను చాలా అద్భుతంగా చిత్రీకరించారు. వాటన్నిటికంటే ఇందులో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయట.
అలాగే కథ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుందట. ఈ మూవీలోని ట్విస్ట్‌లు ఇంతకు ముందు ఏ మూవీలో లేని విధంగా ఉంటాయట. రాజమౌళి తన ప్రతి సినిమా స్టార్ట్ చేయడానికి ముందే ప్రెస్ మీట్ పెట్టి కథ ఏంటో చెప్పేస్తుంటాడు. ఈ మూవీ కథను మాత్రం ఎక్కడా లీక్ చేయడం లేదు. మహేష్ బాబు ఈ మూవీతో పాన్ వరల్డ్ హీరోగా మారుతున్నాడు. కాబట్టి ఇక మీదట ఆయన చేయబోయే సినిమాలు సైతం ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండేలా చూసుకుంటున్నాడు. మొత్తానికైతే గుంటూరు కారం సినిమా వరకు తెలుగు ఇండస్ట్రీకి పరిమితమైన ఆయన, వారణాసితో ఏకంగా పాన్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

