Varanasi Update: ఆ ఎద్దు మీద మహేష్‌ను చూసి ఏడాది అయింది.. మరో అప్‌డేట్ అయినా ఇవ్వండి సార్..!

Varanasi

Varanasi

Varanasi Update: భారతీయ సినీ చరిత్రలో కనివిని ఎరుగని అద్భుతమైన విజువల్ వండర్, గ్లోబల్ అడ్వెంచర్‌గా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. సరిగ్గా ఏడాది క్రితం రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా విడుదలైన ఈ సినిమా ప్రీ గ్లిమ్స్ దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు, అభిమానులకు భారీ అంచులను ఇచ్చింది. రుద్రుడిగా మహేష్ బాబు త్రిశూలం పట్టుకుని ఒక భారీ ఎద్దుపై స్వారీ చేస్తూ కనిపించిన ఆ విజువల్ సోషల్ మీడియాను షేక్ చేసింది. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త అవతారంలో, ఊరమాస్ డివైన్ లుక్‌లో మహేష్ బాబును చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఆ ఒక్క ప్రీ గ్లిమ్స్‌తోనే సినిమాపై అంచనాలు హాలీవుడ్ రేంజ్‌కు చేరుకున్నాయి.

కొత్త అప్‌డేట్ కోసం డిమాండ్

ప్రీ గ్లిమ్స్ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో మళ్లీ ‘వారణాసి’ మానియా ఓ రేంజ్‌లో మొదలైంది. ప్రత్యేక ట్యాగ్స్‌తో అభిమానులు ఆ విజువల్స్‌ను తెగ షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. గతేడాది ఇచ్చిన ఆ భారీ ట్రీట్ తర్వాత, ఇప్పుడు ఏడాది పూర్తయిన సందర్భంగా సినిమా నుంచి మరో అదిరిపోయే అప్‌డేట్ ఇవ్వాలని రాజమౌళి అండ్ టీమ్‌ను ఫ్యాన్స్ విపరీతంగా డిమాండ్ చేస్తున్నారు. రాజమౌళి సినిమాలు అంటేనే ప్రతి అప్‌డేట్ ఒక పండగలా ఉంటుంది కాబట్టి.. ఈ ప్రత్యేక రోజున కొత్త పోస్టర్ లేదా మరో గ్లిమ్స్ వస్తుందా? మహేష్ బాబు నెక్స్ట్ లుక్ ఎలా ఉండబోతోంది? అని సినీ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

1400 కోట్ల భారీ బడ్జెట్..

దాదాపు 1400 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. భారతీయ పురాణాలు, ముఖ్యంగా రామాయణ నేపథ్యంలోని అద్భుతమైన అంశాలను ఒక గ్లోబల్ అడ్వెంచర్ కథాంశంతో మిళితం చేసి రాజమౌళి ఈ దృశ్యకావ్యాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. కేవలం మన దేశానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాకు సంబంధించిన షూటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ విజువల్ వండర్, బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని చారిత్రాత్మక సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.