టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్‌లో ‘పోకిరి’ సినిమా ఒక సంచలనం. ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులనే కాకుండా మహేశ్ బాబు ఇమేజ్‌ను కూడా పూర్తిగా మార్చేసింది. తాజాగా తన కెరీర్ ప్రయాణం గురించి మరియు రాబోయే ప్రాజెక్ట్స్ గురించి మహేశ్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
హాలీవుడ్ మీడియాతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబు మాట్లాడుతూ “పోకిరి సినిమా నా జీవితంలో ప్రతిదీ మార్చేసింది. ఆ సినిమా నన్ను ఒక రాత్రిలో స్టార్‌గా మార్చడమే కాకుండా, నాపై ప్రేక్షకుల అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఆ అంచనాలను అందుకోవడానికి ఆ తర్వాత ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్లాలి? అన్నది నాకు పెద్ద సవాలుగా మారింది. ఆ విజయం ఇచ్చిన కిక్కుతో పాటు ఒక బాధ్యత కూడా పెరిగింది, కానీ నెక్ట్స్ ఎలాంటి సినిమా చేస్తే ఆడియన్స్ కు నచ్చుతుందా అనే టెన్షన్ ఉండేది. చాలా కాలం తర్వాత మళ్ళీ అటువంటి టెన్షన్ ఇప్పుడు Varanasi విషయంలో ఉంది. కానీ పోకిరి సమయంలో ఎలాంటి ఎగ్జైట్‌మెంట్ అయితే ఉందో, ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా అదే కనిపిస్తోంది. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అంతకు మించి ఏదో ఉండబోతోంది. ప్రేక్షకుల అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో నాకు తెలుసు, ఈ ప్రాజెక్ట్ వాటిని ఖచ్చితంగా మించిపోతుంది” అని ధీమా వ్యక్తం చేశారు. పోకిరి ఎలాగైతే తెలుగు సినిమా స్థాయిని పెంచిందో ఈ వారణాసి కూడా ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తుందని ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
