NTV Telugu Site icon

Gyanvapi Mosque: నేడు జ్ఞాన్‌వాపీ ఏఎస్‌ఐ సర్వే నివేదికపై వారణాసి కోర్టు తుది తీర్పు

Gyanvapi

Gyanvapi

Gyanvapi ASI Survey Verdict: జ్ఞాన్‌వాపీ ఆర్కియాలజీ సర్వే నివేదికపై వారణాసి కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఏఎస్‌ఐ సర్వే రిపోర్టును బహిరంగపరచాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించనుంది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు నిర్ణయాన్ని బుధవారం నాడు రిజర్వ్ చేసింది. ఈ కేసు తీర్పు గురువారం రావాల్సి ఉంది.. కానీ అది నిన్నటికి (శుక్రవారం) వాయిదా పడింది.. కానీ తుది తీర్పు ఇవాళ వచ్చే అవకాశం ఉంది.

Read Also: Kapil Dev Birthday: కపిల్‌ దేవ్‌ బర్త్ డే.. రజనీకాంత్‌ ‘లాల్ సలామ్’ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్!

అయితే, జ్ఞాన్‌వాపీ ఏఎస్‌ఐ రిపోర్టుపై హిందూ వర్గీయుల చాలా ఉత్సాహంగా ఉన్నారు.. ఈ నివేదికను బహిరంగపరచాలని వారు నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. అయితే, నివేదికను బహిరంగపరచడంపై ముస్లిం పక్షానికి చెందిన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జ్ఞాన్‌వాపి సర్వే నివేదికను ఏఎస్‌ఐ సీల్డ్ కవరులో కోర్టుకు సమర్పించింది. అప్పటి నుంచి నివేదికను బయటకు తెలియజేయాలని హిందూ వర్గీయులు.. బహిర్గతం చేయొద్దని ముస్లిం పక్ష నేతలు డిమాండ్ చేయడంతో.. ఏఎస్ఐ కూడా కోర్టులో ఒక దరఖాస్తును సమర్పించింది. వచ్చే 4 వారాల పాటు పబ్లిక్‌ చేయకూండా చూడాలని డిమాండ్ చేసింది. జ్ఞాన్‌వాపీకి సంబంధించి 1991 కేసును మళ్లీ విచారించాలని హైకోర్టు ఇటీవల ఆదేశించిందనే విషయాన్ని ఏఎస్‌ఐ తెలిపింది.

Read Also: Thandel : బుజ్జి తల్లే వచ్చేత్తున్న కదే.. ఈ సారి గురి తప్పదేలే అంటున్న నాగచైతన్య

ఇక, హిందూ పక్షం తరపున న్యాయవాది సుభాష్ నందన్ చతుర్వేది మాట్లాడుతూ.. ఏఎస్‌ఐ తన సర్వే నివేదికను సీలు చేసిన కవరులో కోర్టుకు సమర్పించిందని తెలిపారు. సీల్డ్ కవరులో నివేదిక ఉండకూడదని కోర్టును ఆశ్రయించారు. అయితే దీనిని గోప్యంగా ఉంచాలని ముస్లిం పక్ష నేతలు కోరుతోంది. అందువల్ల, నివేదికను బహిరంగపరచాలా వద్దా అనే దానిపై కోర్టు ఈ రోజు నిర్ణయం తీసుకోనుంది. దీంతో పాటు అంజుమన్ అరేంజ్ మెంట్స్ మసీదు కమిటీ కూడా కోర్టులో దరఖాస్తు చేసింది. ఇందులో జ్ఞాన్‌వాపీలోని వుజుఖానాను శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు. వుజుఖానాలో చేపలు చనిపోతున్నాయని ఈ దరఖాస్తులో వెల్లడించింది.