Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Varanasi Court Defers Verdict On Plea For Shivling Worship At Gyanvapi Mosque

Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు కేసులో తీర్పు వాయిదా

Published Date :November 8, 2022 , 12:47 pm
By Mahesh Jakki
Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు కేసులో తీర్పు వాయిదా
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gyanvapi Mosque Case: జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలోని శివలింగాన్ని పూజించేలా అనుమతి ఇవ్వాలంటూ హిందువుల పక్షాన దాఖలైన పిటిషన్‌పై వారణాసిలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు మంగళవారం విచారణను నవంబర్ 14కి వాయిదా వేసింది. సంబంధిత న్యాయమూర్తి నేడు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు హాజరుకానందున తదుపరి విచారణను నవంబర్‌ 14వ తేదీకి వాయిదా వేశారు.జ్ఞానవాపి కాంప్లెక్స్ ప్రాంగణంలో స్వయంభూ జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వరుని ప్రార్థనను వెంటనే ప్రారంభించేందుకు అనుమతి, జ్ఞానవాపి సముదాయం మొత్తాన్ని హిందువులకు అప్పగించడం, ముస్లింల ప్రవేశాన్ని నిషేధించడం వంటి మూడు ప్రధాన డిమాండ్లపై న్యాయస్థానం తన తీర్పును వెలువరించాల్సి ఉంది. ప్రస్తుతం ముస్లింలు ప్రార్థనలు చేసేందుకు అనుమతించడం గమనార్హం.

అక్టోబరులో జరిగిన మునుపటి విచారణలో, వారణాసి కోర్టు ‘శివలింగం’పై ‘శాస్త్రీయ దర్యాప్తు’ని అనుమతించడానికి నిరాకరించింది. జ్ఞానవాపి మసీదు వాజుఖానాలో దొరికిన శివలింగం అని వారు చెప్పుకునే నిర్మాణానికి కార్బన్ డేటింగ్ ఇవ్వాలని హిందూ పక్షం డిమాండ్ చేసింది. అయితే దొరికిన నిర్మాణం ‘ఫౌంటెన్’ అని ముస్లిం పక్షం పేర్కొంది. హిందూ పక్షం వారణాసి జిల్లా కోర్టులో సెప్టెంబర్ 22న ‘శివలింగం’ అని చెప్పుకునే వస్తువు కార్బన్ డేటింగ్‌ను కోరుతూ ఒక దరఖాస్తును సమర్పించింది.
జ్ఞానవాపి మసీదు ఆవరణలో దొరికిన శివలింగంపై ‘శాస్త్రీయ పరిశోధన’కు అనుమతి నిరాకరించిన వారణాసి కోర్టు తీర్పుపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హిందూ పక్షం పేర్కొంది.

Polish Leader: యువతుల అతి మద్యపానమే సంక్షోభానికి కారణం.. పోలిష్‌ నేత సంచలన వ్యాఖ్యలు

సెప్టెంబరు 29 విచారణలో హిందూ పక్షం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేత శివలింగాన్ని కార్బన్ డేటింగ్‌తో శాస్త్రీయ పరిశోధన చేయాలని డిమాండ్ చేసింది. మే 17న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావిస్తూ.. శాంపిల్స్ తీసుకోవడం ద్వారా ఆరోపించిన శివలింగం దెబ్బతిన్నట్లయితే, అది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు అవుతుందని వారణాసి కోర్టు పేర్కొంది. శివలింగం దెబ్బతింటే సాధారణ ప్రజల మతపరమైన మనోభావాలు దెబ్బతింటాయని వారణాసి కోర్టు పేర్కొంది. కార్బన్ డేటింగ్ అనేది పురావస్తు వస్తువు, పురావస్తు పరిశోధనల వయస్సును నిర్ధారించే ఒక శాస్త్రీయ ప్రక్రియ. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు జ్ఞాన్‌వాపి మసీదు-శృంగర్ గౌరీ కేసులో తీర్పును రిజర్వ్ చేసింది. జ్ఞానవాపి మసీదులో పూజలకు సంబంధించిన కేసును సివిల్ జడ్జి నుంచి వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేస్తూ మే 20న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్‌ 14న వారణాసిలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏం తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gyanvapi
  • Gyanvapi Mosque Case
  • Gyanvapi row verdict
  • shivling verdict
  • Supreme Court

తాజావార్తలు

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • Amazon Layoffs: భయంలో టెక్కీలు.. అమెజాన్‌లో 14,000 మందిపై వేటు?

  • Atlee-Raaka: ‘రాకా’ 18 ఏళ్ల కల, ఇది ఆరంభం మాత్రమే.. డైరెక్టర్ అట్లీ ఎమోషనల్ పోస్ట్!

  • Ground Report: అభివృద్ధికి చిరునామాగా మారుతున్నా వరంగల్ జిల్లా కర్రెగుట్టలు

  • Bobby : “ఆయన ఒక కర్మయోగి.. ఒక శిఖరం!”.. పవర్ స్టార్‌పై దర్శకుడు బాబీ ఎమోషనల్..

ట్రెండింగ్‌

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions