NTV Telugu Site icon

Singer Srilalitha: ఘనంగా ‘వరాహరూపం’ ఫేం శ్రీ లలిత నిశ్చితార్థం!

Singer Srilalitha Engagement

Singer Srilalitha Engagement

Singer Srilalitha Engagement with Gudipati Seetaram: గాయని శ్రీలలిత భమిడిపాటి త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. గుడిపాటి సీతారాంతో శ్రీలలిత ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. నిశ్చితార్థంకు సంబంధించిన పోటోలను గాయని శ్రీలలిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఉంగరాలు మార్చుకున్న పిక్స్ కూడా ఆమె షేర్ చేశారు. ఈ ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఫాన్స్, సినీ ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

‘కాంతార’ సినిమా ఎంత హిట్ అయిందో.. అందులోని ‘వరాహరూపం..’ పాట కూడా అంత పాపులర్‌ అయింది. ఈ పాటకు శ్రీలలిత భమిడిపాటి చేసిన కవర్‌ సాంగ్‌ అంతకుమించి ప్రాచుర్యం పొందింది. యూట్యూబ్‌లో ఏకంగా లక్షల వ్యూస్‌ను దక్కించుకుంది. ఆరేళ్ల వయసు నుంచి పలు రియాలిటీ షోలలో మెప్పించిన శ్రీలలితకు సొంత యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా ఉంది. అందులో తాను పాడిన అన్ని సాంగ్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో శ్రీలలితకు మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.

Also Read: Aparna Das Marriage: గుడిలో పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్!

శ్రీలలిత భమిడిపాటి సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు. శ్రీలలిత అమ్మమ్మ వాళ్లూ, ముత్తాతలు సంగీత విద్వాంసులే. ఆమె అమ్మ, నాన్న గాయకులే. మూడున్నరేళ్ల వయసులో ఓ స్టేజీ మీద రైమ్‌ చెప్పమని అడిగితే ‘లింగాష్టకం’ పాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. లిటిల్‌ చాంప్స్‌, పాడుతా తీయగా, బోల్‌ బేబీ బోల్‌, స్వరాభిషేకం.. ఇలా పదిహేనుకు పైగా రియాలిటీ షోలలో శ్రీలలిత పాల్గొన్నారు. ఆమె ఎంఏ మ్యూజిక్‌ పూర్తి చేశారు. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఆమె పాటలు పాడారు. ఓ ఇన్‌స్టిట్యూట్‌ కట్టి కర్ణాటక సంగీతం నేర్పించాలన్నదే శ్రీలలిత టార్గెట్.

Show comments