Site icon NTV Telugu

Vangaveeti Radha: రంగంలోకి వంగవీటి రాధా..! జనసేన ప్లాన్‌ అదే..

Vangaveeti Radha

Vangaveeti Radha

Vangaveeti Radha: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు కాకరేపుతున్నాయి.. అన్ని పార్టీలు ప్రచార వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. వంగవీటి రాధాకృష్ణపై ఫోకస్‌ పెట్టింది జనసేన పార్టీ.. ఆయనను రంగంలోకి దించాలని చూస్తోంది.. అయితే, వంగవీటి రాధా వరుసగా రెండోసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారనే ప్రచారం సాగుతుంది.. కానీ, జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో రాధాను ప్రచారం చేయించాలని భావిస్తున్నారు జనసేన పార్టీ పెద్దలు.

Read Also: Kiara Advani: హాట్ హాట్ అందాలతో కుర్రకారులని కట్టిపడేస్తున్న.. కియారా అద్వానీ

పవన్ కల్యాణ్‌తో పాటు వంగవీటి రాధా కూడా ప్రచారం చేస్తే కాపు ఓట్లు గంపగుత్తగా జనసేన-టీడీపీ-బీజేపీ కూటమికి పడతాయని భావిస్తున్నారు.. వరుసగా రెండోసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తోన్న వంగవీటి రాధా.. నిన్న జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్ ను కలిశారు.. ఈ రోజు ఎంపీ వల్లభనేని బాలశౌరితో భేటీ అయ్యారు.. గత ఎన్నికల మాదిరిగానే.. ఈ సారి కూడా వంగవీటి రాధా.. స్టార్ క్యాంపెయినర్ గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తారని సమాచారం అందుతోంది.. ఆయన ప్రచారం చేస్తే.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మెరుగైన ఫలితాలు వస్తాయని లెక్కలు వేస్తున్నారు. ముఖ్యంగా కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వంగవీటి రాధా కృష్ణతో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారట..

Exit mobile version