NTV Telugu Site icon

Vande Bharat Express: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు మళ్లీ యాక్సిడెంట్.. ఈ సారి ఎద్దు..

Vandebharat

Vandebharat

Vande Bharat Express: ఇటీవల పశువులను ఢీకొన్న ఘటనలతో వార్తల్లో నిలిచిన సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా మళ్లీ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. శనివారం ఉదయం ముంబై సెంట్రల్​ నుంచి గాంధీనగర్‌కు వెళుతున్న వందే భారత్​ ఎక్స్‌ప్రెస్‌ ఓ ఎద్దును ఢీకొట్టింది. ఫలితంగా.. ట్రైన్​ ముందు భాగం దెబ్బతింది.ఇటీవల ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ రైలుకు కష్టాలు వచ్చిపడుతున్నాయి.

India: పాక్‌ గ్రే లిస్ట్‌లో ఉండగా ఉగ్రదాడులు తగ్గిపోయాయి..

ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గుజరాత్‌లోని అతుల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ఎద్దు రైల్వే ట్రాక్‌పైకి దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న రైలు ఆ ఎద్దును ఢీకొట్టింది. ఘటన అనంతరం 15 నిమిషాల పాటు రైలు నిలిచింది. ఈ ఘటనలో రైలుకు ఎలాంటి నష్టం జరగకపోగా.. ముందుభాగం కాస్త విరిగింది. వందే భారత్​ ఎక్స్‌ప్రెస్‌ ఈ విధంగా జరగడం ఇది మూడోసారి. అక్టోబర్​ 6న ముంబై నుంచి గాంధీనగర్‌కు వెళుతున్న క్రమంలో.. వట్వా- మనీనగర్​ రైల్వే స్టేషన్​ వద్ద గేదెను ఢీకొట్టింది. అప్పుడు కూడా నోస్​ ప్యానెల్​ దెబ్బతింది. ఆ మరుసటి రోజు గుజరాత్​ నుంచి ముంబైకి వెళుతుండగా.. ఆనంద్​ సమీపంలో ఓ ఆవు వందేభారత్​ రైలును ఢీకొట్టింది.