NTV Telugu Site icon

Vande Bharat Express: త్రివర్ణ పతాకం స్ఫూర్తితో వందేభారత్ కొత్త లుక్.. రైలులో చేసిన అప్‌గ్రేడ్‌లు ఇవే..

Vande Bharat Express

Vande Bharat Express

Vande Bharat Express: దేశంలో రైల్వేశాఖ ఒకదాని తర్వాత ఒకటిగా వందేభారత్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. రైల్వే ఫీడ్‌బ్యాక్ ప్రకారం వందేభారత్‌ రైళ్లలో మార్పులు చేస్తోంది. ఇప్పటివరకు వందేభారత్ రైళ్లలో 25 మార్పులు చేసినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం పేర్కొన్నారు. రైల్వే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా వందేభారత్ రైళ్లలో మార్పులు చేస్తున్నామని వెల్లడించారు. కొత్త రైళ్లలో సేఫ్టీ ఫీచర్ యాంటీ-క్లైంబర్స్‌పై కూడా పనులు జరుగుతున్నాయని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు మీరు వందే భారత్ రైలును నీలం, తెలుపు రంగులలో మాత్రమే చూసి ఉంటారు. ఇకమీదట కాషాయ రంగులో కూడా చూడవచ్చు. వందేభారత్‌ రైళ్లకు కాషాయ రంగు వేయాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు కాషాయ రంగు వేయనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కొత్త వందే భారత్ రైలు కాషాయ, వైట్ , బ్లాక్ కలర్ కాంబినేషన్‌లో రానున్నాయి. వందేభారత్ రైలు కొత్త రంగును త్రివర్ణ పతాకం నుంచి సూర్తిగా తీసుకున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ కొత్త వందే భారత్ రైలులో కాషాయ రంగు ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ వందేభారత్‌ రైలుకు సంబంధించిన ఫోట్‌లను కేంద్ర మంత్రి ట్విట్టర్‌లో పంచుకున్నారు.

Also Read: Nirmala Buch: మధ్యప్రదేశ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శి నిర్మలా బుచ్ కన్నుమూత

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ ఫ్యాక్టరీలో వందేభారత్ రైళ్లను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. వందేభారత్ రైళ్లలో 25 మార్పులు చేశామని ఆయన పేర్కొన్నారు. 25 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిర్దేశిత మార్గాల్లో పని చేస్తున్నాయని, మరో రెండు రిజర్వ్ చేయబడ్డాయని, 28వ రైలును ప్రయోగాత్మకంగా మారుస్తున్నారని ఆయన తెలిపారు. ఇటీవల, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల అప్‌గ్రేడ్ వెర్షన్‌లు గోరఖ్‌పూర్-లక్నో, జోధ్‌పూర్-సబర్మతి మార్గాలను ప్రారంభించారు. ఈ మైలురాయితో దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవల సంఖ్య 50కి చేరుకుంది.