Site icon NTV Telugu

Vanathi Srinivasan: మహిళల సాధికారత కేవలం మోడీతోనే సాధ్యం

Vanathi Srinivasan

Vanathi Srinivasan

Konda Sangeetha Reddy: మహిళలు సాధికారతకు కేంద్రం లోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ అన్నారు. సమాజంలో సగభాగమైన మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మోడీ కృషి అభినందనీయం అని తెలిపారు. గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ ఏర్పాటు ‌చేసిన నారీ శక్తి సమావేశానికి శ్రీనివాసన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు.

ఈ సందర్భంగా చేవెళ్ల బీజేపీ పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి సంగీత రెడ్డి మాట్లాడుతూ.. మహిళ అభ్యున్నతి కోసం ముద్రా రుణాలు ఇవ్వడంతో పాటు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగిందని ఆమె తెలిపారు. మహిళలు అభ్యున్నతి కేంద్రం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో శిల్పా రెడ్డి, తెలంగాణా మహిళా మోర్చా అధ్యక్షురాలు; చేవెళ్ల బిజెపి మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version