వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. గన్నవరం పోలీసులు నమోదు చేసిన మైనింగ్ కేసుల్లో 41ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని రెండు పిటిషన్లు దాఖలు చేశారు వంశీ. ఈ క్రమంలో.. న్యాయస్థానం విచారణ జరిపింది. 2 కేసుల్లో ఏడేళ్ల లోపు సెక్షన్లు మాత్రమే నమోదు చేశారని.. 41ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలని వంశీ తరఫు న్యాయవాది కోరారు. అదనంగా మరికొన్ని సెక్షన్లు కూడా కేసులో నమోదు చేసినట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో.. పూర్తి వివరాలు సమర్పించాలని, పిటిషన్లపై వచ్చే సోమవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
Read Also: Sunita Williams: స్పేస్ నుంచి సునీతా విలియమ్స్ రెస్క్యూ మరోసారి వాయిదా.. కారణం ఏంటి..?
కాగా.. వల్లభనేని వంశీ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు.. బెయిల్ మంజూరు చేయాలని వంశీ తరుపున న్యాయవాది సత్య శ్రీ వాదనలు వినిపించారు. ఇది కేవలం రాజకీయంగా కక్షసాధింపు చర్యల్లో భాగంగానే జరిగిందని.. అందుకే వంశీపై కేసుపెట్టారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. మరోవైపు.. ఇప్పటికే వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించింది ప్రభుత్వం.. వంశీ తరపుపు న్యాయవాది వాదనలు ముగిసిన తర్వాత.. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు. మరోవైపు.. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 17వ తేదీన మరోసారి కోర్టులో తమ వాదనలు వినిపించనున్నారు ఇరువైపులా న్యాయవాదులు. కాగా, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ రిమాండ్‌ను ఈ నెల 25వ తేదీ వరకు కోర్టు పొడిగించిన విషయం విదితమే. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పని చేసిన కంప్యూటర్ ఆపరేటర్‌ను కిడ్నాప్ చేసి, బెదిరింపులకు దిగిన కేసులో వల్లభనేని వంశీతో పాటు అతడి అనుచరులను కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో 2023లో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటన అప్పట్లో సంచలనంగా మారింది.
Read Also: IPL History: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు డకౌట్ స్టార్లు ఎవరో తెలుసా?