Site icon NTV Telugu

న్యాయవ్యవస్థలో రాజకీయ ప్రమేయం ఉంటుందా?

దేశంలోని అన్ని కోర్టుల్లో పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ నీసర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. దీనికి కారణం కోర్టుల్లో న్యాయమూర్తుల కొరత ఉండటమేనని ఆయన అభిప్రాయపడ్డారు. కిందిస్థాయి కోర్టులు, డిస్ట్రిక్ లెవల్ కోర్టుల్లోని న్యాయమూర్తులు పరీక్షల ద్వారా ఎంపిక అవుతున్నా.. హైకోర్టులు, సుప్రీంకోర్టుల్లో మాత్రం కొలిజీయం సిఫారసులు, ప్రభుత్వాల అనుమతుల కారణంగా ఎంపిక ప్రక్రియలో ఆలస్యం అవుతుందని తెలిపారు. కొలిజీయం పంపిన లిస్టును ప్రభుత్వాలు ఒకే చేయడం లేదని, వాళ్లు ఒక లిస్టు పంపిస్తే ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తమకు ఇష్టం వచ్చిన న్యాయవాదుల పేర్లను లిస్టులో చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రమేయం వల్ల న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: ధోనీ అభిమానులకు ఈరోజు మరపురాని రోజు

మరోవైపు మార్కెట్‌లో కొన్ని బ్రాండ్లకు డూప్లికేట్లు సృష్టించి అమ్ముతున్నారని సీనియర్ అడ్వకేట్ నీసర అహ్మద్ వెల్లడించారు. కొత్తగా ఒక ప్రొడక్టును క్రియేట్ చేసి మార్కెటింగ్ చేసుకోవాలంటే సమయం పడుతుందని చాలా మంది ఉన్న బ్రాండ్లకు కల్తీ క్రియేట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారని.. అలాంటి వారు ఒకవేళ దొరికితే చట్టపరంగా శిక్షించబడతారని, సివిల్ కేసుతో పాటు క్రిమినల్‌ కేసు కూడా రిజిస్టర్ అవుతుందని నీసర్ అహ్మద్ స్పష్టం చేశారు. అందువల్ల ఎవరూ డూప్లికేట్ ప్రొడక్టులు అమ్మవద్దని, ఒకవేళ అమ్మితే పేరు నాశనం కావడమే కాక అనవసరంగా చిక్కుల్లో పడతారని ఆయన హెచ్చరించారు. అటు క్లైయింట్‌ల డ్రాఫ్టులు రాసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని ఆయన సూచించారు. ఒకవేళ డ్రాఫ్టుల్లో తప్పులు ఉంటే ఆ పిటిషన్‌లు తిరస్కరణకు గురికావడమే కాకుండా పై కోర్టులకు వెళ్లే అవకాశం కూడా ఉండదన్నారు. న్యాయపరమైన కేసులకు సంబంధించిన మరిన్ని విషయాల కోసం వకీల్ సాబ్ విత్ సుప్రీంకోర్టు అడ్వకేట్ నీసర్ అహ్మద్ గారి ఇంటర్వ్యూను చూడండి.

Exit mobile version