Site icon NTV Telugu

Vaishnavi Sharma: కుర్రాళ్ల మనసు కొల్లగొడుతున్న కొత్త టీమిండియా బౌలర్.. సరికొత్త క్రష్ అంటూ..!

Vaishnavi Sharma

Vaishnavi Sharma

Vaishnavi Sharma: భారత మహిళల క్రికెట్ జట్టుకు మరో కొత్త తార పరిచయమైంది. మధ్యప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువ స్పిన్నర్ వైష్ణవి శర్మ అంతర్జాతీయ అరంగ్రేటంతోనే అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వైష్ణవి, తన లెఫ్ట్-ఆర్మ్ స్లో ఆర్థోడాక్స్ స్పిన్ తో ప్రత్యర్థి బ్యాటర్లకు ముప్పుగా మారింది. మైదానంలో బంతితో మెప్పించడమే కాదు.. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్ అవుతుండటంతో నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. కొందరు అభిమానులు ఆమెను “సరికొత్త క్రష్” అంటూ కొనియాడుతుండగా.. మరికొందరు అందంలో ‘స్మృతి మంధాన’కు కాంపిటిషన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Ibomma Ravi: క్యాంకాడర్ ప్రింట్కు ఓ రేట్.. HD ప్రింట్లకు ఓ రేట్.. కథ మాములుగా లేదుగా..!

శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైష్ణవి శర్మ మొత్తం 5 మ్యాచ్‌లు ఆడింది. ప్రతి మ్యాచ్‌లోనూ బౌలింగ్ చేస్తూ తన స్థిరత్వాన్ని చాటింది. మొత్తం 19 ఓవర్లు బౌలింగ్ చేసి 119 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. వైష్ణవి బౌలింగ్ సగటు 23.80, ఎకానమీ రేట్ 6.26, స్ట్రైక్ రేట్ 22.8గా ఉండటం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన ప్లేయర్ కు ఇవి మంచి గణాంకాలే. ఇక లక్ష్య ఛేదన సమయంలో వైష్ణవి మరింత ప్రభావవంతంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆమె బౌలింగ్ సగటు 19.00, స్ట్రైక్ రేట్ 16.0గా ఉండటం విశేషం. ఒత్తిడి పరిస్థితుల్లోనూ ఆమె బంతితో ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలదో ఈ గణాంకాలే నిదర్శనం.

Trivikram Srinivas: మొదటి రోజు నెగటివ్ టాక్.. అమ్మ ఒడిలో తలపెట్టుకుని ఏడ్చిన త్రివిక్రమ్!

ఇప్పటివరకు టీ20ల్లో మాత్రమే అవకాశాలు దక్కినా, వైష్ణవి శర్మ ప్రదర్శనను చూస్తే భారత మహిళల జట్టుకు ఆమె దీర్ఘకాలిక ఆస్తిగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్రమశిక్షణతో కూడిన స్పిన్, లైన్-లెంగ్త్‌పై పట్టు, ఒత్తిడిలోనూ ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేయగలగడం ఆమె బలాలు. సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతున్నా, మైదానంలో మాత్రం పూర్తిగా ఆటపై దృష్టి పెట్టిన వైష్ణవి శర్మ… రాబోయే రోజుల్లో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుందనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతుంది.

Exit mobile version