NTV Telugu Site icon

Vaishnavi Chaitanya: ఎన్ని కష్టాలు పడిందో మన బేబీ.. వాళ్ల అమ్మ కూడా ఏడ్చేసిందట

Vaishnavi

Vaishnavi

Vaishnavi Chaitanya: రీసెంట్ గా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని నమోదు చేసిన మూవీ బేబీ. ఇద్దరు అబ్బాయిలను మోసం చేసే క్యారెక్టర్ లో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య ఇరగదీసింది. కథ అంతా ఆమె చుట్టూనే తిరగడంతో వైష్ణవికి చాలా మంచి గుర్తింపు వచ్చింది. ఆమె నటనను పెద్ద హీరోలు సైతం అభినందించారు. అల్లు అర్జున్ ప్రత్యేకంగా సక్సెస్ ఈవెంట్ పెట్టి మరీ అభినందించాడు. దానిలో ప్రత్యేకంగా వైష్ణవి కోసమే ఈవెంట్ కు వచ్చానని కూడా బన్నీ పేర్కొ్న్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా వైష్ణవి నటకు ఫిదా అయ్యారు. మొత్తానికి బేబీ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్ల పరంగా పెను సంచలనమే రేపింది. దీంతో అందులో నటించిన వారందరికి మంచి గుర్తింపు వచ్చింది. వైష్ణవికి అయితే చాలా ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైష్ణవి తన లైఫ్ జర్నీని పంచుకుంది. తానేమి చాలా త్వరగా హీరోయిన్ కాలేదని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలు చేస్తూ వాటిలో గుర్తింపు రావడంతో యూట్యూబ్ లో కొన్ని షార్ట్ ఫిల్మ్ లు, కవర్ సాంగ్ లు చేశానని తెలిపింది. ఇక షణ్ముఖ్ తో కలిసి వైష్ణవి చైతన్య చేసిన సాఫ్ట్ వేర్ డెవలపర్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక బేబీ సినిమాలో వైష్ణవి సరిగ్గా సరిపోతుందని భావించిన సాయి రాజేష్ ఆమెకు అవకాశం ఇవ్వగా తన నటతో వైష్ణవి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Also Read: Sreeleela: అభిమానులకు షాక్.. సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న శ్రీలీల

ఇక వైష్ణవి తన 10వ తరగతి నుంచే ఇంటి బాధ్యతలను తీసుకున్నట్లు తెలిపింది. అప్పట్లో తనకు డ్యాన్స్ మాత్రమే వచ్చని బర్త్ డే పార్టీలు, ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తే రూ.700 వచ్చేవని వాటితో వాళ్ల అమ్మ ఇంట్లోకి బియ్యం తెచ్చేదని వైష్ణవి తెలిపింది. షార్ట్ ఫిల్మ్స్ లో చేస్తున్నప్పుడు డ్రస్ మార్చకోవడానికి రూమ్స్ ఉండేవి కాదని అప్పుడు బాత్రూంలోనే మార్చుకునే దానినని తెలిపిన వైష్ణవి అది చూసి వాళ్ల అమ్మ ఇవన్నీ మనకు వద్దు వెళ్లిపోదాం అని ఏడ్చేసిందని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యింది. అంతేకాకుండా ఏదో చిన్న సినిమాలో చేస్తున్నప్పుడు డ్రెస్ మార్చుకోవడానికి కారావ్యాన్ వాడుకుంటానని అడగగా ఆమె మొహం మీదే తిట్టిందని వైష్ణవి తెలిపింది. అప్పుడు తనకు ఏడుపు ఒక్కటే తక్కువ అని తెలిపింది. ఇక చాలా మంది తన గురించి తప్పుగా మాట్లాడుతూ ఏం సాధించలేదని అనేవారని అవి తనను ఎంతో బాధించేవని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.