NTV Telugu Site icon

Tirumala Temple: మరికాసేపట్లో శ్రీవారి ఆలయంలో తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు

Tirumala

Tirumala

Tirumala Temple: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి నుంచే వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఏకాదశి సందర్భంగా తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. తర్వాత దక్షిణ, ఉత్తర భాగంలోని వైకుంఠ ద్వారాలను తెరుస్తారు.శ్రీవారికి నిత్య పూజలు నిర్వహించిన అనంతరం 1:45 గంటల నుంచి భక్తులకు వీఐపీ దర్శనాలు ప్రారంభం కానున్నాయి. 11వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలను తెరిచే ఉంచి గతేడాది తరహాలో పదిరోజుల పాటు దర్శనాలు కల్పించనున్నారు. సుమారు 3 నుంచి 4 వేల మంది వివిధ కేటగిరీలకు చెందిన వీఐపీలకు దర్శన ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటల నుంచి టోకెన్ కలిగిన భక్తులను టీటీడీ అధికారులు దర్శనానికి అనుమతించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు స్వర్ణ రథంపై భక్తులకు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు.

Vaikuntha Ekadasi 2023: వైకుంఠ ఏకాదశి సందర్భంగా “శ్రీ తిరుపతి వెంటేశ్వర కళ్యాణం” ప్రత్యేక ప్రదర్శన

ఇప్పటికే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసిన టీటీడీ అధికారులు టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లను ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుపతిలో తొమ్మిది ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా భక్తులకు జారీ చేశారు. టికెట్ల లభ్యత సమాచారాన్ని టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ ‘తిరుమల.ఓఆర్జీ’ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే కౌంటర్ల వద్ద ఏర్పాటు చేసిన ఎల్‌సీడీ స్ర్కీన్ల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఒక ప్రాంతంలో రద్దీ అఽధికంగా ఉంటే మరో ప్రాంతానికి భక్తులు సులువుగా చేరుకునేలా ప్రతి కౌంటర్‌ వద్ద క్యూఆర్‌ కోడ్‌ బోర్డులను ఏర్పాటు చేశారు. ఆ క్యూఆర్‌ కోడ్‌ను సెల్‌ఫోన్‌లో స్కాన్‌ చేస్తే ఆయా ప్రాంతాలకు గూగుల్‌ రూట్‌ మ్యాప్‌ను పొందవచ్చు.

Show comments