Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ ప్రపంచంలో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఏకంగా 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఈ యువ సంచలనం, ఇటీవల భారత్-ఎ తరఫున కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఇప్పుడు భారత్-ఐర్లాండ్ సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసేందుకు సిద్ధమవడంతో అతడి క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది.
టికెట్లకు భారీ డిమాండ్ – క్షణాల్లో ఖాళీ
నేడు బెల్ఫాస్ట్లోని స్టార్మాంట్ మైదానంలో జరగబోయే తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్ అరంగేట్రం (Debut) చేయబోతున్నాడనే వార్తతో అభిమానులు ఎగబడ్డారు. ఐర్లాండ్ క్రికెట్ బోర్డు చైర్మన్ బ్రియాన్ తెలిపిన వివరాల ప్రకారం.. వైభవ్ ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు సాధారణం కంటే మూడు రెట్ల డిమాండ్ వచ్చింది. దీనితో మ్యాచ్ టికెట్లన్నీ హాట్ కేకుల్లా క్షణాల్లో అమ్ముడయ్యాయి. వైభవ్ చారిత్రాత్మక క్షణాన్ని వీక్షించేందుకు అతని తల్లిదండ్రులు కూడా ఇప్పటికే బెల్ఫాస్ట్ చేరుకున్నారు.
Also Read
వేదిక ఎంపికపై తీవ్ర విమర్శలు..
అయితే, ఇంతటి భారీ క్రేజ్ ఉన్న మ్యాచ్‌ను కేవలం 4,200 నుండి 6,000 వరకు మాత్రమే సీటింగ్ సామర్థ్యం ఉన్న చిన్నదైన బెల్ఫాస్ట్ మైదానంలో నిర్వహించడంపై క్రికెట్ అభిమానుల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
డబ్లిన్ వేదిక ఎందుకు కాలేదు?: గతంలో భారత్ ఆడిన మ్యాచ్‌లన్నీ దాదాపు 12,000 సామర్థ్యం కలిగిన డబ్లిన్‌లోని మలాహైడ్ స్టేడియంలో జరిగాయి. కానీ ఈసారి అక్కడ మ్యూజిక్ కాన్సెర్టులు ఉండటం వల్ల వేదికను బెల్ఫాస్ట్కు మార్చాల్సి వచ్చింది. ఇటీవల బెల్ఫాస్ట్ నగరంలో స్థానికంగా కొన్ని అల్లర్లు జరగడంతో భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే క్రికెట్ ఐర్లాండ్ అంతా సవ్యంగానే ఉందని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టి, అత్యంత పిన్న వయస్కుడిగా భారత జట్టులో చోటు సంపాదించిన వైభవ్ సూర్యవంశీ మ్యాచ్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని టీమిండియా నేడు ఐర్లాండ్‌తో తలపడనుండగా, అందరి కళ్లూ ఈ 15 ఏళ్ల యువ కిరటంపైనే ఉన్నాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!