Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్‌గా వైభవ్..

Vaibhav Sooryavanshi Weakness

Vaibhav Sooryavanshi Weakness

ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ (RR) యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని ఒక దురదృష్టకరమైన రికార్డు వెంటాడుతోంది. గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుతో జరుగుతున్న హై-ప్రెషర్ క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మరోసారి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నారు. పవర్‌ప్లేలోనే 500 పరుగుల మైలురాయిని దాటి ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ 15 ఏళ్ల కుర్రాడు, వ్యక్తిగత స్కోరు 96 పరుగుల వద్ద అవుటై పెవిలియన్ చేరాడు.

ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ నైంటీస్ (90s) లో అవుట్ కావడం ఇది మూడోసారి. దీంతో ఐపీఎల్ ఒకే సీజన్‌లో అత్యధిక సార్లు 90 పరుగుల మార్కు వద్ద అవుటైన ఆటగాడిగా ఆస్ట్రేలియా గ్లెన్ మాక్స్‌వెల్ పేరిట ఉన్న ఒక చెత్త రికార్డును వైభవ్ సమం చేశాడు. 2014 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడిన మాక్స్‌వెల్ మూడు సార్లు 90ల్లో అవుట్ కాగా, ఇప్పుడు 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ కూడా మూడు సార్లు సెంచరీకి చేరువగా వచ్చి బోల్తా పడ్డాడు. ఈ జాబితాలో లక్నో తరపున ఆడుతున్న మిచెల్ మార్ష్ (2 సార్లు – 2026) తర్వాతి స్థానంలో ఉన్నాడు.

×
×
Ad

గుజరాత్ ముందు భారీ టార్గెట్
వైభవ్ సూర్యవంశీ (96) సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన ఫెరీరా 11 బంతుల్లో 38 మెరుపు ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. వైభవ్‌తో పాటు మిగిలిన బ్యాటర్లు కీలక పరుగులు జోడించడంతో గుజరాత్ విజయానికి 215 పరుగుల టార్గెట్ నమోదైంది. ఫైనల్ చేరాలంటే గుజరాత్ టైటాన్స్ ఈ భారీ రన్‌చేజ్‌ను అధిగమించాల్సి ఉంటుంది.