IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. కాటేరమ్మ కొడుకుతో వైభవ్ ఓపెనింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే పరిమితమైన సంజూ శాంసన్ స్థానంలో వైభవ్‌కు తుది జట్టులో అవకాశం లభించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ చేతుల మీదుగా వైభవ్ తన తొలి అంతర్జాతీయ టీ20 క్యాప్‌ను అందుకున్నాడు.
సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు
ఈ అరంగేట్రంతో వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లలో) అత్యంత చిన్న వయసులోనే భారత్ తరఫున బరిలోకి దిగిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1989లో సచిన్ 16 ఏళ్ల వయసులో అరంగేట్రం చేయగా, వైభవ్ కేవలం 15 ఏళ్ల వయసులోనే ఆ రికార్డును అధిగమించాడు.
Also Read
- Raptadu School Attack: "కన్నీళ్లు ఆగడం లేదు".. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
- Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
- Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?
- Bangladesh: ‘‘ఢిల్లీనా.. ఢాకానా?’’ బంగ్లాదేశ్‌లో మళ్లీ భారత్ వ్యతిరేక నినాదాలు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..
ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వైభవ్ చేరిక గురించి కెప్టెన్ మాట్లాడుతూ, అతడికి మైదానంలో ఒత్తిడిని ఎదుర్కొనే అద్భుతమైన నైపుణ్యం ఉందన్నాడు. నెట్స్‌లో అతడు బౌలర్లను ఎదుర్కొనే విధానం చూస్తేనే అతడి ప్రతిభ ఏంటో అర్థమవుతుందని ప్రశంసించాడు.
మరోవైపు ఇంగ్లాండ్ జట్టులో కూడా మార్పులు జరిగాయి. గాయం నుంచి కోలుకున్న స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి జట్టులోకి రాగా, జోష్ టంగ్ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేస్తున్నాడు. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ముందంజ వేయాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.
ఇరు జట్ల తుది శ్రేణి (Playing XI):
భారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్.
తాజావార్తలు
-
Dorothy : డొరొతీ ఒరిజినల్ క్లైమాక్స్ ఇదే.. లీక్ చేసిన కార్తీక్ సుబ్బరాజు
-
Jio Voice Only Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.147 నుంచే వాయిస్ ఓన్లీ ప్లాన్స్! వ్యాలిడిటీ వివరాలివే!
-
Bank Holidays November 2026: నవంబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
-
Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!