Site icon NTV Telugu

Vaibhav Suryavanshi: శతక్కొడుతున్న చిచ్చరపిడుగు.. ఆరు టోర్నమెంట్‌లు.. ఆరు శతకాలు

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఓ 14 ఏళ్ల కుర్రవాడు క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డ్‌ను తన పేరున సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఇంతకీ ఆ చిచ్చరపిడుగు పేరు ఏంటో తెలుసా.. వైభవ్ సూర్యవంశీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన యువ సంచలనం ఈ 14 ఏళ్ల కుర్రవాడు. ఒకే ఫార్మాట్‌లో నిలకడగా రాణించడం కష్టమైన ఈ రోజుల్లో అద్భుతమైన ప్రతిభతో వైభవ్ సూర్యవంశీ ఏకంగా ఆరు వేర్వేరు టోర్నమెంట్‌లలో సెంచరీలు సాధించి వరల్డ్ రికార్డ్‌ను సాధించాడు.

READ ALSO: Dollar vs Rupee: అల్ టైం కనిష్ఠానికి రూపాయి విలువ.. అసలేం జరుగుతుంది..?

ఆరు విభిన్న ఫార్మట్‌లలో స్థిరంగా తన ప్రదర్శనను కొనసాగిస్తున్న వైభవ్, త్వరలోనే సీనియర్ టీమ్ ఇండియా జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని క్రికెట్ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. ఈ 14 ఏళ్ల చిచ్చరపిడుగు తన ఆట ద్వారా ఏర్పడిన స్టార్‌డమ్‌లో ముగినిపోయి కెరీర్‌ను పాడు చేసుకోకుంటే భవిష్యత్తు టీమిండియాకు గొప్ప ఆస్తిగా మారుతాడని అంటున్నారు.

2025వ ఏడాదిలో వైభవ్ సాధించిన సెంచరీల జాబితా :

​ఐపీఎల్ (IPL): ఇండియన్ ప్రీమియర్ లీగ్లో శతకం.

​యూత్ టెస్ట్ (Youth Test): సుదీర్ఘ ఫార్మాట్‌లో సెంచరీ.

​యూత్ వన్డే (Youth ODI): యూత్ వన్డేలలో అద్భుత శతకం.

​ఇండియా-ఏ (India A): ​ఇండియా-ఏ సెంచరీ.

​ఎస్ఎమ్ఏటీ (SMAT): దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సూపర్ శతకం.

యూ-19 ఆసియా కప్ (U-19 Asia Cup): యూ-19 ఆసియా కప్‌లో యూఏఈపై మెరుపు సెంచరీ.

READ ALSO: Union Cabinet Decisions: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర క్యాబినెట్..

Exit mobile version