Vaibhav Suryavanshi: ఐపీఎల్లో ఆ దిగ్గజం రికార్డ్‌ను బద్ధలుకొడుతా.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Suryavanshi: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మార్చి 15న న్యూఢిల్లీలో అట్టహాసంగా నిర్వహించిన ‘నమన్ అవార్డుల’ వేడుకలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా స్టార్స్ సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మలతో కలిసి వేదికను పంచుకున్న 14 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ, తన ఫ్యూచర్ ప్లాన్స్‌ను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
READ ALSO: Hyderabad: ఘోరం.. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం.. ఆపై హత్య!
Also Read
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
హర్ష భోగ్లే ప్రశ్న.. వైభవ్ అదిరిపోయే సమాధానం..
ఈ వేడుకలో ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే వైభవ్‌ను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. “ఐపీఎల్లో నీవు బద్దలు కొట్టాలనుకుంటున్న అతిపెద్ద రికార్డు ఏది?” అని అడగ్గా.. బీహార్‌కు చెందిన ఈ యువ సంచలనం తడుముకోకుండా సమాధానమిచ్చాడు. “క్రిస్ గేల్ నెలకొల్పిన 175 నాటౌట్ రికార్డును బద్దలు కొట్టడమే నా లక్ష్యం” అని తన ఆత్మవిశ్వాసాన్ని చాటాడు. 2013లో పూణే వారియర్స్‌పై గేల్ కేవలం 66 బంతుల్లోనే ఈ చారిత్రాత్మక స్కోరు సాధించిన సంగతి తెలిసిందే. వైభవ్ మాటలు కేవలం అతిశయోక్తి కాదని అతని గణాంకాలు చెబుతున్నాయి. 2026 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై వైభవ్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించి అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. అతని అద్భుత బ్యాటింగ్‌తో భారత్ రికార్డు స్థాయిలో ఆరోసారి ఛాంపియన్‌గా నిలిచింది.
ఐపీఎల్లో రికార్డుల రారాజు..
వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే ఐపీఎల్లో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ, కేవలం 14 ఏళ్ల 32 రోజుల వయసులో గుజరాత్ టైటాన్స్‌పై సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుని, ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ (30 బంతులు) తర్వాత అత్యంత వేగంగా వంద పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఒక భారతీయుడికి ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. చిన్న వయసులోనే దిగ్గజాల రికార్డులపై కన్నేసిన వైభవ్, భవిష్యత్తులో టీమిండియాలో కీలక ఆటగాడిగా మారతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026లో వైభవ్ మరెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
Boss Baby has his eyes set for this one! 👀
Will Vaibhav Sooryavanshi achieve this feat in the #TATAIPL 2026 ✍️👇
Watch BCCI Naman awards 👉https://t.co/8W5zMWhfvk pic.twitter.com/CZ3xnzqifF
— Star Sports (@StarSportsIndia) March 15, 2026
READ ALSO: Isha Ambani: ఆస్కార్ వేదికపై అంబానీ కుమార్తె సోయగం.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఇషా!
తాజావార్తలు
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!