Site icon NTV Telugu

యూఏఈ బౌలర్స్ పై Vaibhav Sooryavanshi శివతాండవం.. 234 పరుగుల తేడాతో భారీ విజయం..!

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi: భారత్ U-19 జట్టు యూఏఈ U-19పై దుబాయిలోని ఐసీసీ అకాడమీలో భారీ విజయాన్ని నమోదు చేసింది. నేడు (డిసెంబర్ 12) జరిగిన మ్యాచ్‌లో యూఏఈ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం భారత్‌కు వరంగా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో కేవలం 6 వికెట్లు కోల్పోయి ఏకంగా 433 పరుగులు చేసింది. ఈ భారీ స్కోరుకు ప్రధాన కారణం వైభవ్ సూర్యవంశీ ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్. అతను కేవలం 95 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సర్లతో 171 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. అతనికి ఆరోన్ వర్గీస్ (69), విహాన్ మల్హోత్రా (69), వేదాంత్ త్రివేది (38) బ్యాటర్ల నుంచి మద్దతు ఇచ్చారు. చివర్లో అభిజ్ఞాన్ కుందు (32 నాటౌట్), కనిష్క్ చౌహాన్ (28) కూడా చక్కటి ఫినిష్ ఇవ్వడంతో భారత్ భారీ స్కోరు దాటింది.

Nothing Phone (4a) సిరీస్ స్పెక్స్, ధర, రంగులు లీక్.. లాంచ్ ఎప్పుడంటే..?

లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ U-19 జట్టు ప్రారంభం నుంచే భారత బౌలర్లకి బలయ్యింది. టాప్ ఆర్డర్ త్వరగా పెవిలియన్ చేరడంతో పూర్తిగా ఒత్తిడిలో పడింది. మిడిలార్డర్‌లో ఉద్ధిష్ సూరి (78 నాటౌట్), పృథ్వీ మధు (50) పోరాడినా.. స్లో స్ట్రైక్ రేట్ కారణంగా మ్యాచ్‌ను కాపాడలేకపోయారు. యూఏఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 199 పరుగులకే పరిమితమైంది. భారత జట్టు బౌలర్లలో దేవేంద్రన్ 21 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా.. కిషన్ సింగ్, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్, విహాన్ మల్హోత్రా చెరో ఒక వికెట్ తీసి కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. దీనితో మొత్తంగా యూఏఈ పై 234 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. సంచలన ఇన్నింగ్స్‌తో పాటు బౌలింగ్‌ కూడా చేసిన వైభవ్ సూర్యవంశీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ ఘన విజయం భారత్ U-19 జట్టు టోర్నమెంట్లో తమ ప్రయాణాన్ని శుభారంభంతో ప్రారంభించినట్టైంది.

Akhanda 2: ప్రీమియర్స్ కి 10 కోట్లు కలెక్షన్లు!

Exit mobile version