Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌తో బౌలర్స్ ముచ్చెమటలు పట్టిస్తున్న రాజస్థాన్ రాయల్స్ యంగ్ స్టార్ వైభవ్ సూర్యవంశీపై పాకిస్తాన్ వైపు నుంచి విచిత్రమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. వైభవ్ అసాధారణ బ్యాటింగ్ చూసిన అక్కడి కొందరు విశ్లేషకులు “బ్యాట్‌లో AI చిప్ ఉందా?” అంటూ అనుమానాలు వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సూర్యవంశీ గత సీజన్ నుంచే తన ప్రతిభ ఏంటో ప్రపంచానికి చూపిస్తూ వస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్ పై కేవలం 35 బంతుల్లో శతకం సాధించి సంచలనం సృష్టించిన ఈ యువ ఆటగాడు, ఆ తర్వాత కూడా రికార్డుల పరంపర కొనసాగించాడు. ఇటీవల జింబాబ్వేలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లో భారత జట్టు గెలుపులో కీలక పాత్ర పోషిస్తూ ఫైనల్లో 175 పరుగులతో అదరగొట్టాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో కూడా సూర్యవంశీ అదే జోరును కొనసాగిస్తున్నాడు. 8 ఇన్నింగ్స్‌లో 357 పరుగులు చేసి, 234కి పైగా స్ట్రైక్ రేట్‌తో టాప్ రన్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 36 బంతుల్లో శతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ విశ్లేషకుడు డా. నౌమాన్ నియాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సులు కొడితే పవర్‌ప్లేలో ఇంకేం మిగులుతుంది? అతని స్ట్రైక్ రేట్ 200కి పైగా ఉంది. ఇలాంటి ఆట మనుషులు ఆడినట్టుగా అనిపించడం లేదు. అతని బ్యాట్‌లో AI చిప్ ఉందేమో చూడాలి అంటూ వ్యాఖ్యానించాడు.
అయితే మరోవైపు సూర్యవంశీ టెక్నిక్‌పై కూడా ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా అతని రిస్టు పొజిషన్, బ్యాట్ స్వింగ్ ఆర్క్ ఎంతో అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నాడు. నిజానికి 18 ఏళ్లకు వచ్చినప్పుడు శరీరం మారుతుంది. కానీ సూర్యవంశీ ఇంకా చిన్న వయసులోనే ఈ స్థాయిలో ఆడటం అసాధారణం అని అన్నాడు. దీనితో సోషల్ మీడియాలో పాకిస్థాన్ విశ్లేషకుడిపై దారుణంగా ట్రోల్స్ మొదలయ్యాయి.
🚨 AI chip in Vaibhav Sooryavanshi's bat?
– Vaibhav Sooryavanshi is batting like he’s got an AI chip installed. Frankly, just like we have doping tests, he should be tested too. This doesn’t look human. What a player he is!! Unreal! – Dr Nauman Niaz #TATAIPL #RRvsSRH #IPL2026 pic.twitter.com/xUZ4eg2iyU
— Tehseen Qasim (@Tehseenqasim) April 26, 2026
