Site icon NTV Telugu

Vaddiraju Ravichandra : తెలంగాణ ఉద్యమం పుట్టింది ఇల్లందు గడ్డపైనే…

Vaddiraju Ravichandra

Vaddiraju Ravichandra

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. 2014, 2018 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కి ఒకే ఒక్క సీటు వచ్చింది ఈసారి ఒక్క సీటు కూడా ప్రతిపక్షాలకు ఇవ్వొద్దని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం పుట్టింది ఇల్లందు గడ్డపైనేనని ఆయన అన్నారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ గెలుపు ఈ గడ్డపైనే మొదలవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. పోరం కనకయ్య ఎమ్మెల్యేగా ఓడిపోయిన పార్టీ గౌరవించింది కానీ పార్టీ మారి ఇప్పటివరకు పార్టీకి రాజీనామా చేయలేదు మీకు నీతి ఉందా అని ఆయన మండిపడ్డారు.

Also Read : Urfi Javed: ఉర్ఫి జావెద్ అరాచకం.. మరో వింత డ్రెస్సుతో రచ్చ..

మీరు కొంతమంది ఆర్థిక వ్యక్తులతో తిరుగుతున్నారు కానీ కార్యకర్తలు మీతో రారని ఆయన అన్నారు. ఒకేసారి 115 మంది అభ్యర్థులని ప్రకటించిన ఘనత కేసీఆర్ కే దక్కిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో 100 సీట్లు గెలిచి కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేస్తామని వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతునిద్దామని వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. రాష్ట్ర ఏర్పాటు జరిగిన ఈ పదేళ్లలోనే దేశం మొత్తం మీద తెలంగాణను అన్ని రంగాలలో అగ్రగామిగా తీర్చిదిద్దిన మహానేత కేసీఆర్ అని కొనియాడారు రవిచంద్ర.

Also Read : Gaddam Aravinda Reddy : మంచిర్యాల టిక్కెటను బీసీలకు కేటాయించాలి

Exit mobile version