Site icon NTV Telugu

Vadarevu Beach Tragedy: సరదాగా వెళ్తే ముగ్గురిని బలితీసుకున్న రాకాసి అలలు.. వాడరేవు తీరంలో విషాదం

Vadarevu Beach Tragedy

Vadarevu Beach Tragedy

Vadarevu Beach Tragedy: సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు వెళ్లిన పాపానికి రాకాసి అలలు ముగ్గురిని బలి తీసుకున్నాయి. ఈ విషాదకరమైన ఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో వెలుగుచూసింది. సముద్రంలో స్నానానికి దిగిన ఐదుగురు అలల తాకిడికి గల్లంతయ్యారు. వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

READ ALSO: Shiva : నాగార్జున ’శివ’ రీ రిలీజ్ డేట్ వచ్చేసింది..

సరదాగా గడిపేందుకు సెలవు రోజుల్లో సందర్శకులు సూర్యలంక బీచ్‌తో పాటు, వాడరేవు సముద్ర తీరానికి వస్తుంటారు. అమరావతిలోని విట్‌ యూనివర్సిటీ నుంచి 10 మంది విద్యార్థుల బృందంగా సెలవులు రావడంతో వాడరేవుకు వచ్చారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన శ్రీ సాకేత్‌, సాయి మణిదీప్‌, జీవన్‌ సాత్విక్‌, సోమేష్‌, గౌతమ్‌‌లు అలల తాకిడికి కొట్టుకుపోయారు. వారిని గమనించిన స్థానికంగా ఉన్న మత్స్యకారులు, గజ ఈతగాళ్లు వెంటనే వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం మాత్రం శూన్యం అయ్యింది. గల్లంతైన కాసేపటికి ముగ్గురి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. సోమేష్‌తోపాటు చీరాలకు చెందిన గౌతమ్‌ సముద్రంలో గల్లంతయ్యారు. ఈసందర్భంగా బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్‌ ఘటనా స్థలిని పరిశీలించి మాట్లాడారు. ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృతదేహాలను చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు. సముద్రంలో గల్లంతయిన ఇద్దరు విద్యార్థుల కోసం అగ్నిమాపక, మత్స్యశాఖ అధికారులు డ్రాగన్ లైట్లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

READ ALSO: Shetty Balija Scholarships: పాలకొల్లులో నన్ను గెలిపించింది బీసీలు, ఎస్సీలే: మంత్రి నిమ్మల

Exit mobile version