Site icon NTV Telugu

Vaazha 2: మలయాళ సెన్సేషన్ ‘వాలా 2’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది..

Vaazha 2

Vaazha 2

Vaazha 2: ఒక చిన్న సినిమా స్టార్ట్ అయ్యి.. కేరళ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన అందుకున్న మలయాళ సంచలనం ‘వాలా Ⅱ’ . ఇప్పుడు ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. సావిన్ SA దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ V వంటి యువ నటీనటులు ఆకట్టుకున్నారు. సాహు గారపాటి ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై, విపిన్ దాస్, హారిస్ దేశం, P.B. అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం మలయాళంలో ఇప్పటికే రూ.200 కోట్ల స్థూల వసూళ్లతో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగు వెర్షన్ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ‘నేచురల్ స్టార్’ నాని ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ రోజు విడుదల చేశారు.

READ ALSO: VDxSHOURYUV : రౌడీ స్టార్ కోసం నేచురల్ స్టార్..విజయ్-నాని సందడి!

‘వాలా’ ముగిసిన దగ్గర నుంచి కొనసాగుతూ.. సీక్వెల్ కథ మెయిన్ గ్యాంగ్ జీవితాలను ప్రజెంట్ చేసింది. కాలేజ్ జీవితం, మారుతున్న స్నేహాలు, అనూహ్య మలుపులు… కొత్త దశలో వారి ప్రయాణం సాగుతుంది. ట్రైలర్ చూస్తే కామెడీ, భావోద్వేగ క్షణాలు కలగలిపిన కథతో పాటు, నాస్టాల్జియా మూమెంట్స్ తో కట్టిపడేసింది. ఈ చిత్రంలోని ప్రత్యేకతల్లో ఒకటి ‘ప్రేమమ్’ సినిమాకు ఇచ్చిన ట్రిబ్యూట్. అల్‌ఫోన్స్ పుత్రెన్ దర్శకత్వంలో నివిన్ పాలీ నటించిన ఆ సినిమా ఇంపాక్ట్ ఇందులో కనిపిస్తుంది. హషీర్, అజిన్ జాయ్, వినాయక్, అలన్ బిన్ సిరాజ్ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు, బిజు కుట్టన్, సుధీష్, విజయ్ బాబు వంటి అనుభవజ్ఞులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ట్రైలర్ పరంగా చూస్తే యూత్ ఫుల్ ఎలిమెంట్స్, ఎమోషనల్ మూమెంట్స్ తో ‘వాలా 2’ తెలుగు ప్రేక్షకుల గుర్తుండిపోయే సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు అనిపించింది. ‘వాలా 2’ ఈనెల 24న థియేటర్లలోకి రాబోతుంది.

READ ALSO: Lenskart controversy: ఒక్కరోజే లెన్స్‌కార్ట్‌కు రూ.4,500 కోట్లు లాస్.. అసలేం జరిగిందంటే?

Exit mobile version