ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ.హనుమంత రావు స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రీతి.. లాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి… ఎన్‌కౌంటర్ చేస్తే మానవ హక్కుల వాళ్ళు గొడవ చేస్తారు… హాజిపూర్ లో ముగ్గురు అమ్మాయిలను చంపాడు శ్రీనివాస్ రెడ్డి.. జడ్జిమెంట్ కూడా వచ్చింది.. కానీ ఇప్పటి వరకు శిక్ష అమలు కాలేదు అని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు అప్రూవల్ ఇవ్వాలంటా.. ఎందుకు ఇవ్వడం లేదని ఆయన అన్నారు.
Also Read : Bellaiah Naik : మహిళలకు తెలంగాణలో రక్షణ లేకుండా పోయింది
అమ్మాయిలు చనిపోయినప్పుడు మానవ హక్కుల వాళ్ళు ఎందుకు స్పందించడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రతి యూనివర్సిటీలో ర్యాగింగ్ పై నిఘా పెట్టాలని, నేరం చేయాలంటే చస్తాం అనే భయం వచ్చేలా శిక్షలు ఉండాలన్నారు. నేరం చేసి నాలుగు రోజులు జైల్లో ఉండి రావచ్చు అనే ఫిలింగ్ వచ్చేట్టు చేశారని ఆయన విమర్శించారు. ఎక్స్ గ్రేషియాలు ఆపండని, నిందితులకు శిక్ష పడేలా చూడాలని ఆయన కోరారు.
Also Read : CM YS Jagan Open Challenge: చంద్రబాబు, పవన్‌కు జగన్ ఓపెన్ ఛాలెంజ్.. ఆ దమ్ముందా..?
ప్రీతి తండ్రి అన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, ఎందుకు వచ్చింది ఇలాంటి పరిస్థితి అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు వీహెచ్ చురకలంటించారు. రాహుల్ గాంధీ కష్టపడుతున్నారని, ఈ గ్రూపులు… లొల్లి వద్దన్నారు. రాహుల్ గాంధీనే కష్టపడుతుంటే… లొల్లి బంద్ చేయండని ఆయన వ్యాఖ్యానించారు. మహేశ్వర్ రెడ్డి.. పాదయాత్రపై థాక్రే మాట్లాడుతారని, నేను ఏదైనా మాట్లాడితే లొల్లి ఐతదన్నారు వీహెచ్.
