రాముడిని ఆయుధంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ చూస్తోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు. భద్రాచలం రాముడికి ఆహ్వానం ఎందుకు ఇవ్వలేదని, రాహుల్ గాంధీకి వస్తున్న ఇమేజ్ ని చూసి ఓర్వలేక బీజేపీ అడ్డుపడే పనిలో ఉందన్నారు. అభివృద్ధి లేదు కానీ.. హిందు ఓట్ల మీదనే బీజేపీకి ప్రేమ అని ఆయన మండిపడ్డారు. రాముడు మీ ఒక్కడికే దేవుడా . ! . మోడీ అన్ని దేవాలయాలు తిరగవచ్చు.. కానీ రాహుల్ గాంధీ వెళ్ళాలి అంటే అనుమతి అవసరమా అని ఆయన ప్రశ్నించారు. నువ్వు పిలిచినప్పుడే గుడికి పోవాలా అని ఆయన ప్రశ్నించారు. అయోధ్యలోనే రాముడు ఉన్నాడా.. భద్రాచలంలో లేడా అని హనుమంత రావు వ్యాఖ్యానించారు.
నాకంటే ఎక్కువ రామ భక్తులు ఉన్నాడా..? అస్సాం సీఎం హేమంత్ బిశ్వ రాహుల్ గాంధీ ని రావణుడు అనడాని తీవ్రంగా ఖండిస్తున్నా అని అన్నారు. నీవు అసలు సీఎం వేనా.. మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన అన్నారు. మోడీ రాముడా .. రాహుల్ గాంధీ రావణుడా .. ఇది ఏం న్యాయం అని ఆయన మండిపడ్డారు. మణిపూర్‌లో వందల మంది మహిళలు చనిపోతే మోడీ వెళ్ళారా.. పార్లమెంట్ ఎన్నికల కోసం రాముడిని ఆయుధంగా వాడుకుంటున్నారని వీహెచ్ ధ్వజమెత్తారు.
