రాహుల్ గాంధీ పాదయాత్ర స్ఫూర్తితో భట్టి విక్రమార్క పీపుల్ మార్చ్ పాదయాత్ర ప్రారంభించారని, బడుగు బలహీన వర్గాల కోసం, నిరుద్యోగ యువత కోసం, రైతుల కోసం భట్టి పాదయాత్ర చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ.హనుమంత రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కిందని ఆయన అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తోందని, నోట్ల రద్దు తుగ్లక్ నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. డబుల్ బెడ్ రూమ్ లు, దళితులకు మూడు ఎకరాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, కేంద్రంలో నరేంద్ర మోడీ ఇంటికి పంపించి రాహుల్ గాంధీని ప్రధానిగా తీసుకురావాలని వీహెచ్ అన్నారు.
Also Read : Bihar: భీకర పోరు, అనేక రౌండ్ల కాల్పులు బీజేపీ కార్యక్రమంలో రచ్చ రచ్చ
అంతేకాకుండా.. ‘రాహుల్ గాంధీ నాయకత్వంలో వరసగా కాంగ్రెస్ పార్టీ విజయాలను సాధిస్తుంది.. కాంగ్రెస్ పార్టీల విభేదాలు లేవు… కలిసి కట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాం.. రాహుల్ గాంధీ ఆలోచన విధానాన్ని దేశంలో కొనసాగిస్తున్న ఒకే ఒక్క వ్యక్తి, నేత భట్టి విక్రమార్క. సోనియా తెలంగాణ ఇవ్వకపోతే.. కెసిఆర్ కుటుంబం మొత్తం నాంపల్లి దర్గా దగ్గర కూర్చుంటుండే.ఈసారి కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారె పరిస్థితి రావద్దు. ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది… వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలి..’ అని వీహెచ్ కోరారు.
