ఇటీవల గుత్తికోయల దాడిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస రావు మరణించిన విషయం తెలిసిందే. అయితే.. శ్రీనివాస రావు మృతితో పోడు భూముల వ్యవహారం మరోసారి రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. శ్రీనివాస రావు మృతికి ఇప్పటికే రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అయితే.. పోడు భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని విపక్షాలు ముక్తకంఠంతో విమర్శలు చేస్తున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం శివాయిగూడెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వి.హనుమంతరావు మాట్లాడుతూ.. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతి చెందటం భాధాకరమని, ప్రభుత్వ చీఫ్ విప్ రేగ కాంతారావు కవ్వింపుమాటల వలనే గిరిజనులు దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
Also Read : The India Box Office Report-October 2022: వెండి తెరను మురిపించి.. మెరిపించిన సం‘చలన’ చిత్రం..
అంతేకాకుండా.. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు గిరిజనులపై సవతి తల్లి ప్రేమను చూపిస్తాడని ఆయన విమర్శించారు. పోడు భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వట్లేదని ఆయన ప్రశ్నించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య ప్రభుత్వ హత్యనేనని ఆయన ధ్వజమెత్తారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు కుటుంబానికి కోటి రూపాయలు, భార్యకు గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వాలని హనుమంత రావు కోరారు. ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి అండగా ఉంటుదని, దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు హనుమంత రావు వ్యాఖ్యానించారు.
Also Read : Brutal incident For Match Box: అగ్గిపెట్టె ఇవ్వలేదని దారుణం..నిందితుడి అరెస్ట్