NTV Telugu Site icon

Uttarpradesh Crime: శ్రద్ధా హత్య తరహాలో మరో హత్య.. దేహాన్ని 6 ముక్కలు చేసి..

Crime News

Crime News

Uttarpradesh Crime: దేశవ్యాప్తంగా శ్రద్ధా వాకర్ హత్య సంచలనం సృష్టించింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్న శ్రద్ధాను ఆమె పార్టనర్‌ అఫ్తాబ్ అమీన్ పూనావాలా దారుణంగా చంపేశాడు. మే నెలలో ఈ హత్య జరిగితే శ్రద్ధా తండ్రి ఫిర్యాదులో ఇటీవల వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి ప్రతీ రోజూ రాత్రి వేళల్లో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో విసిరేశాడు. ఈ కేసులో కీలక సాక్ష్యాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా శ్రద్ధా హత్య తరహాలోనే ఉత్తరప్రదేశ్‌లో మరో మహిళను దారుణంగా చంపాడు ఆమె మాజీ ప్రేమికుడు. నవంబర్ 15న ఆజంగఢ్‌ జిల్లాలోని పశ్చిమ గ్రామం వెలుపల ఉన్న బావిలో మృతదేహాన్ని కొందరు స్థానికులు గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరాధనగా గుర్తించబడిన మహిళ మృతదేహం పాక్షిక నగ్న స్థితిలో కనుగొనబడింది. కొన్ని రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు ఆజంగఢ్‌ ఎస్పీ అనురాగ్‌ ఆర్య తెలిపారు. ఢిల్లీలో ఓ వ్యక్తి భాగస్వామిని గొంతు కోసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా కోసి 300 లీటర్ల ఫ్రిజ్‌లో దాదాపు మూడు వారాల పాటు తన వద్ద ఉంచిన ఘటనను మరువకముందే ఈ దారుణం జరగడం గమనార్హం. 20 ఏళ్ల వయసు ఉన్న ఆరాధన తనను కాదని వేరొకరిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో యువరాజ్‌ యాదవ్ తన తల్లిదండ్రులు, బంధువు సర్వేష్, ఇతర కుటుంబ సభ్యుల సహాయంతో ఆమెను హత్య చేయాలని ప్లాన్ చేశాడు.

ఆమె అజంగఢ్ జిల్లాలోని ఇషాక్ పూర్ గ్రామంలో నివసిస్తోంది. బాధితురాలితో యాదవ్‌కు అక్రమ సంబంధం ఉందని, ఈ ఏడాది మొదట్లో వేరే వ్యక్తితో పెళ్లి చేసుకుందని ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చింది. నవంబర్ 9న యువరాజ్‌ యాదవ్ తన బైక్‌పై ఆరాధనను ఆలయానికి తీసుకెళ్లాడు. వారు అక్కడికి చేరుకోగానే సర్వేష్ సహాయంతో చెరకుతోటలో ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆమె మృతదేహాన్ని ఆరు భాగాలుగా నరికి పాలిథిన్ సంచిలో వేసి బావిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. తలను కొంత దూరంలో ఉన్న చెరువులోకి విసిరారు. ఈ కేసులో ఇప్పటివరకు పదునైన ఆయుధం, కంట్రీ మేడ్ పిస్టల్, క్యాట్రిడ్జ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ నేరంలో యాదవ్‌కు సహకరించిన సర్వేష్, ప్రమీలా యాదవ్, సుమన్, రాజారాం, కళావతి, మంజు, షీలా ఇంకా పరారీలోనే ఉన్నారు.

Viral Pre Wedding Shoot: పెళ్ళికి ముందే లీకైన నగ్న ఫోటోషూట్.. పరువు పోయిందని

పోలీసులు మృతురాలి తలను వెలికితేసేందుకు నిందితుడిని ఆదివారం చెరువు వద్దకు తీసుకెళ్లగా… అక్కడ దాచిపెట్టుకున్న నాటుతుపాకీతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు తుపాకీతో కాల్చడంతో అతని కాలుకు గాయమైంది. పోలీసులతో జరిగిన తుపాకీ కాల్పుల్లో యువరాజు యాదవ్‌కు బుల్లెట్ తగిలిందని పోలీసులు వెల్లడించారు.

Show comments