NTV Telugu Site icon

UP: జడ్జి కుక్క మాయం.. 2 డజన్ల మందిపై కేసు

Dog Missinh

Dog Missinh

ధనవంతులు.. లేదంటే వీఐపీలు తమ ఇళ్లల్లో ఖరీదైన కుక్కలు పెంచుకుంటారు. అంతేకాకుండా వాటిని చూసుకునేందుకు కేర్‌టేకర్‌ను కూడా ఏర్పాటు చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు బయటకు తీసుకుని వెళ్లినప్పుడు హఠాత్తుగా దాడులకు తెగబడుతుంటాయి. ఇలాంటి ఘటనలు కూడా అనేకం చూశాం. అలాగే ఇంకొన్ని సార్లు ఖరీదైన డాగ్‌లు మాయం అవుతుంటాయి. వాటి కోసం పోలీసులు వెతికిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? ఓ కుక్క రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది.

ఇది కూడా చదవండి: Ebrahim Raisi Last Journey: ముగిసిన ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలు..

తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఓ జడ్జి కుక్క మాయం అయింది. న్యాయమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు డజన్ల మందిపై కేసు నమోదు చేశారు. తమ పొరుగింటి అహ్మద్ పెంపుడు కుక్కను దొంగిలించినట్లు న్యాయమూర్తి కుటుంబం పోలీసులకు కంప్లంట్ ఇచ్చింది. బరేలీలో సివిల్ జడ్జి నివాసం ఉంటుంది. ఆ ఇంటి నుంచి కుక్క అపహరించబడింది.

ఇది కూడా చదవండి: Kalki – Bujji: 6 టన్నులు-6 కోట్లు.. 30 గంటలు.. ‘బుజ్జి’ గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఇదిలా ఉంటే ఈ కుక్క విషయంలో మే 16న కాలనీలో పెద్ద గొడవే జరిగింది. న్యాయమూర్తి కుటుంబీకులు, అహ్మద్‌ కుటుంబీకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా అహ్మద్‌ కుమారుడు ఖాదీర్‌ఖాన్‌ న్యాయమూర్తి కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేశాడు. చంపేస్తానని బెదిరించాడు. అంతేకాకుండా మే 16న రాత్రి 9:45 గంటల ప్రాంతంలో అహ్మద్ భార్య న్యాయమూర్తి నివాసానికి వచ్చి తమతో మాట్లాడాలని పట్టుబట్టింది. తమ కుమార్తెపై కుక్క దాడి చేసిందంటూ అహ్మద్ భార్య.. జడ్జి కుటుంబసభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.

న్యాయమూర్తి ప్రస్తుతం హర్దోయ్‌లో విధులు నిర్వహిస్తుండగా… అతని కుటుంబం బరేలీలోని సన్‌సిటీ కాలనీలో నివాసం ఉంటుంది. అయితే కుక్క విషయంలో జరిగిన గొడవ తెలియగానే.. అతను లక్నో నుంచి బరేలీ పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఫోన్ ద్వారా సంఘటన గురించి సమాచారం ఇచ్చారు. ఫిర్యాదు కూడా చేశారు. దీంతో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏరియా అధికారి అనితా చౌహాన్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీసులు న్యాయమూర్తి కుక్క కోసం వెతుకుతున్నారు. అంతేకాకుండా జడ్జి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు… జంతు హింస చట్టం కింద రెండు డజన్ల మందికి పైగా వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఇక ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు న్యాయమూర్తి కుటుంబం నిరాకరించింది.

ఇది కూడా చదవండి: Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు నక్సల్స్ మృతి..