NTV Telugu Site icon

Uttarkashi Tunnel : అమ్మా నేను బాగున్నాను, టైంకి తిను.. టన్నెల్లో చిక్కుకున్న తల్లికి కొడుకు సూచన

New Project

New Project

Uttarkashi Tunnel : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సిల్క్యారా టన్నెల్ ప్రమాదం జరిగి నేటికి 10 రోజులు గడిచింది. అయినా కార్మికులు సొరంగంలోనే ఇంకా చిక్కుకునే ఉన్నారు. అయితే, మంగళవారం ఉదయం ఈ కేసులో రెస్క్యూ టీమ్ పెద్ద విజయం సాధించింది. సొరంగంలో చిక్కుకున్న కొందరు కార్మికులు తొలిసారిగా వారి కుటుంబాలతో మాట్లాడారు. కార్మికులు తమ కుటుంబ సభ్యులతో 6 అంగుళాల పైప్‌లైన్ ద్వారా మాట్లాడారు.

ఇంతలో సొరంగంలో చిక్కుకున్న ఒక కార్మికుడు తన తల్లికి భావోద్వేగ సందేశాన్ని పంపాడు. అది విని అందరి కంట కన్నీళ్లు వచ్చాయి. ఆ కార్మికుడి పేరు జైదేవ్. సొరంగం కూలిన ప్రదేశంలో సూపర్‌వైజర్‌తో మాట్లాడుతున్నప్పుడు, జైదేవ్ బెంగాలీలో ఇలా అన్నాడు, “దయచేసి రికార్డ్ చేయండి, నేను మా అమ్మతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అమ్మ, నా గురించి చింతించకండి… నేను బాగున్నాను… నువ్వు, నాన్న సమయానికి ఆహారం తినండి.”

Read Also:Wednesday : బుధవారం వినాయకుడిని ఇలా పూజిస్తే చాలు.. అష్టఐశ్వర్యాలు కలుగుతాయి..

సొరంగంలో చిక్కుకున్న వ్యక్తుల వాయిస్ రికార్డింగ్‌లను వారి కుటుంబాలకు పంపుతున్నారు. సొరంగం తవ్వే సమయంలో పడిపోవడంతో 41 మంది కూలీలు చిక్కుకుపోయారు. ఇంటర్నేషనల్ టన్నెలింగ్ అండ్ అండర్ గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్నాల్డ్ డిక్స్ ఉత్తరకాశీ టన్నెల్ కూలిపోయిన ప్రదేశంలో కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. చిక్కుకున్న కూలీల వీడియో తొలిసారిగా వెలుగులోకి వచ్చింది.

వీడియోలో కార్మికులందరూ సురక్షితంగా ఉన్నారు. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీల కోసం జమ్మూ కాశ్మీర్ బజరంగ్ దళ్ హవాన్ నిర్వహించింది. గల్లంతైన కూలీలకు సోమవారం 6 అంగుళాల పైపుల ద్వారా గంజి, కిచడీ పంపిణీ చేశారు. అంతకుముందు డ్రైఫ్రూట్స్, మందులు, నీరు, ఆక్సిజన్‌ను నాలుగు అంగుళాల పైపుల ద్వారా కార్మికులకు పంపిస్తున్నారు. కార్మికులను ఖాళీ చేయించేందుకు యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తరలింపు ఆప్షన్లను కనుగొనడానికి డ్రోన్‌లు, రోబోట్‌లను కూడా మోహరించారు.

Read Also:Vijayashanti : బీజేపీ కేసీఆర్ అవినీతిపై మాట్లాడుతది కానీ చర్యలు ఉండవు