Site icon NTV Telugu

Uttarakhand Tunnel Collapse: రంగంలోకి అంత‌ర్జాతీయ ట‌న్నెలింగ్ నిపుణుల బృందం

Uttarkhand Tunnel Collapse

Uttarkhand Tunnel Collapse

Uttarakhand Tunnel Collapse: ఉత్తరాకాండ్‌ రాష్ట్రం ఉత్తరకాశిలోని సిల్కియారా సొరంగం కుప్పకూలిన ఘటన జరిగి ఎనిమిది రోజులు అవుతోంది. సొరంగంలో చిక్కుకున్న 41 కార్మికులు బిక్కుబిక్కుమంటు రోజులు గడుపుతున్నారు. ఇంకా అక్కడ రెస్యూ ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉంది. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. కానీ సహాయ చర్యల్లో తరచూ అవాంతారాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టన్నెల్‌ నిపుణులను అధికారులు రంగంలోకి దింపారు. సోమవారం ఉదయం అంతర్జాతీయ టన్నెల్‌ నిపుణుడు అర్నాల్డ్‌ డిక్స్‌ బృందం ఉత్తరాకాండ్‌ చేరుకుంది.

Also Read: Tirupati: తిరుపతి లో షాకింగ్ ఘటన.. పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

రెస్క్యూ ఆపరేషన్ తొమ్మిదో రోజుకు చేరుకోవడంతో ఇంటర్నేషనల్ టన్నెల్లింగ్ అండ్ అండర్ గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్నాల్డ్ డిక్స్ సంఘటన స్థలంలో నిపుణులతో కలిసి ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెస్క్యూ ఆప‌రేష‌న్ పనులు సాగుతున్నాయని, తన బృందం మొత్తం ఇక్క‌డే ఉంద‌ని తెలిపారు. ఈ త్వరలోనే సమస్యను పరిష్కరించి కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక్క‌డ చాలా ప‌ని జ‌రుగుతోంద‌ని, చిక్కుకున్న కార్మికులే కాదు రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్న‌వాళ్లు కూడా సుర‌క్షితంగా ఉండాల‌ని అర్నాల్డ్ సూచించారు.

Also Read: Fishing Harbour Fire Accident: ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్నిప్రమాదం.. అసలు కారణం ఇదా..?

కాగా ఇప్పటికే ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ తమ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఉపయోగపడే భారీ పరికరాలను ఘటనా స్థలానికి తీసుకొచ్చే బాధ్యతను ఎయిర్ ఫోర్స్ తీసుకుంది. అలాగే ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించడానికి భారత ఆర్మీకి చెందిన ఓ డ్రోన్ వచ్చింది. ఇది ఏరియల్ మానిటరింగ్‌, ప్రాజెక్ట్ ఆపరేషన్‌ను సమర్థవంతంగా పూర్తి చేయడానికి సహాయపడుతోంది.

Exit mobile version