NTV Telugu Site icon

Uniform Civil Code: ఉత్తరాఖండ్‌లో వచ్చే వారం నుంచి యూసీసీ బిల్లు అమలు

Ucc Bill

Ucc Bill

దేశంలోనే యూనిఫాం సివిల్ కోడ్-యూసీసీ (యూనిఫాం సివిల్ కోడ్)ను అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవబోతుంది. సీఎం పుష్కర్ సింగ్ ధామి యూసీసీని అమలు చేయడానికి ప్రభుత్వం తరపున పూర్తి సన్నాహాలు చేశారు. జస్టిస్ (రిటైర్డ్) రంజనా దేశాయ్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ యూనిఫాం సివిల్ కోడ్‌పై రాబోయే కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి నివేదికను సమర్పించే అవకాశం ఉంది. దీపావళి పండగ తర్వాత ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది.

Read Also: Iceland Earthquakes: 14 గంటల వ్యవధిలో 800 భూప్రకంపనలు.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ఐస్‌లాండ్‌!

అసెంబ్లీ సెషన్స్ లోనే యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును ఆమోదించే అవకాశం ఉంది. దీంతో యూసీసీకి చట్టపరమైన హోదా లభిస్తుంది.ఈ ఏడాది జూన్‌లో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) ముసాయిదా కమిటీ సభ్యులు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన ప్రకాష్ దేశాయ్ ఉత్తరాఖండ్ లో యూనిఫాం సివిల్ కోడ్ ది అమలు కోసం ప్రయత్నం చేస్తున్నారు. కోడ్ యొక్క ముసాయిదా తయారు చేయబడింది.. త్వరలో ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

Read Also: Kanna Laxminarayana: ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలన్నా, స్వేచ్ఛగా బ్రతకాలన్నా.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి..!

ఉత్తరాఖండ్‌లో ప్రతిపాదిత యూనిఫాం సివిల్ కోడ్ యొక్క ముసాయిదా ఇప్పుడు పూర్తైంది అని జస్టిస్ రంజాన్ దేశాయ్ అన్నారు. ముసాయిదాతో పాటు నిపుణుల కమిటీ నివేదిక ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సమర్పించింది. ఉత్తరాఖండ్ తర్వాత గుజరాత్ లో కూడా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేయవచ్చని తెలియజేస్తున్నారు. దీంతో యూసీసీ అమలు చేసే రెండో రాష్ట్రంగా గుజరాత్ అవతరించనుంది.

Show comments