ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. ప్రస్తుతం మంటలు నైనిటాల్ నగరం వరకు వ్యాపించాయి. మంటల కారణంగా పొగలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం మంటలు నైనిటాల్ హైకోర్టు కాలనీ వైపు విస్తరిస్తున్నాయి. దీంతో అప్రత్తమైన ఉత్తరఖండ్ ప్రభుత్వం మంటలు ఆర్పడానికి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాయం కోరింది. దీంతో మంటలు ఆర్పడానికి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రంగంలో దిగింది. ఆర్మీ అధికారులు హెలికాప్టర్ల సాయంతో చెలరేగతున్న మంటలపై నీటిని వెదజల్లుతూ ఆర్పుతున్నారు. నైనిటాల్ లేక్‌లో బోటింగ్ సేవలు నిలిపిస్తున్నట్లు అధికారాలు తెలిపారు.
ఇది కూడా చదవండి: BRS KTR: బీఆర్ఎస్ లోనే గౌరవం ఉందన్న ఈటల మాటను గుర్తుపెట్టుకోండి..
ఇప్పటివరకు హైకోర్టు కాలనీకి ఎటువంటి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. కానీ మంటలు ప్రమాదకారంగా పలు భవనాలకు సమీపంగా చేరుకుంటుందని హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రాటర్ తెలిపారు. నైనిటాల్ జిల్లాలోని లారియా కాంటా అడవుల్లో కూడా మంటలు వ్యాపించగా.. అక్కడి ఐటీఐ భవనం పాక్షికంగా దెబ్బతింది. శుక్రవారం రుద్రప్రయాగ్‌లో అడవులకు నిప్పుపెట్టేందుకు యత్నిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అడవుల్లో మంటలను అరికట్టేందుకు ఏర్పాటైన బృందం అరెస్టు చేసినట్లు రుద్రప్రయాగ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అభిమన్యు తెలిపారు. జఖోలిలోని తడియాల్ గ్రామానికి చెందిన నరేష్ భట్ అనే గొర్రెల కాపరి తన గొర్రెలకు మేత కోసం కొత్త గడ్డిని పెంచడానికి నిప్పు పెట్టినట్లుగా గుర్తించారు.
ఇది కూడా చదవండి: SABARI: ‘అనగనగా ఒక కథలా’ తల్లికి బిడ్డే ప్రపంచం అని చెప్పే గీతమిది చంద్రబోస్..
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అడవుల్లో చెలరేగిన మంటలపై శనివారం సమీక్ష నిర్వహించారు. మంటలు ఆర్పడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. గడిచిన వారం రోజుల్లో అడవుల్లో కార్చిచ్చు ప్రమాదాలు వేగంగా విస్తరిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో సుమారు 31 కొత్త అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగిన ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఇది కూడా చదవండి: KCR: సోషల్ మీడియాలో అడుగుపెట్టిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్..
