ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల కోడ్ నడుస్తున్న వేళ అనేక రకాల కొత్త రూల్స్ అవలంబన కాబడుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎలాంటి వాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని రాష్ట్రాల పోలీసులతో పాటు, కేంద్ర బలగాలు కూడా గట్టి బందోబస్తులను ఏర్పాటు చేస్తున్నాయి. ఇకపోతే భారతదేశంలో ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏప్రిల్ 19న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.
Also Read: UPSC Civils 2023 Results: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల.. ఆదిత్య శ్రీవాత్సవకు తొలి ర్యాంకు!
ఈ కారణంగా తొలి దశలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మొత్తం ఐదు స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. భద్రత కారణాల దృష్ట్యా., నేపాల్ – ఉత్తరాఖండ్ సరిహద్దులను మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి రానున్న 72 గంటల పాటు మూసివేయబోతున్నాయి భద్రత దళాలు. ఇందుకోసం ఎస్ఎస్బి సిబ్బందిని కోసం సరిహద్దుల్లో నియమించారు.
Also Read: Ayodhya Ram Mandir : డిసెంబర్ 2024 నాటికి గ్రాండ్ రామ్ టెంపుల్ పూర్తి.. ప్రత్యేక రాళ్లకు ఆర్డర్
ఏప్రిల్ 16 సాయంత్రం 5 గంటలకు సమయం నుండి ఏప్రిల్ 19 సాయంత్రం 5 గంటల వరకు భారత్ – నేపాల్ దేశాల మధ్య సరిహద్దులను మూసివేస్తున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 19 ఎన్నికల నిబంధనలో భాగంగా ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే భారత్ – నేపాల్ దేశాల మధ్య సరిహద్దులు ఎప్పటి లాగానే తెరుచుకొని ఉంటాయి. ఈ మధ్యలో ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ఇరుదేశాల మధ్య రవాణా చేసేందుకు గాను ఆర్మీ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే., ఈ తాత్కాలిక మూసివేత కేవలం ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం నేపాల్ దేశంతో సరిహద్దును పంచుకుంటుంది. ఇలా నేపాల్ కు సరిహద్దులో ఉన్న అన్ని ప్రాంతంలో ఆర్మీ సిబ్బందిని ఏర్పాటు చేశారు.
