ఉత్తరాఖండ్‌లో ఘోరం జరిగింది. విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారిపోయింది. ఎంతో సంతోషంగా గడపాలని బయల్దేరిన వారిని మృత్యువు కబళించింది. కారు అదుపుతప్పి కొండ మీద నుంచి కిందపడడంతో ఐదుగురు విద్యార్థులు మృతిచెందగా.. మరొక విద్యార్థికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Vadde Sobhanadreeswara Rao: దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ..! ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెద్ద కుట్ర..!
శనివారం ముస్సోరీలో కారు కొండమీద అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కళాశాల విద్యార్థులు మృతి చెందారు. నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయితో సహా ఐదుగురు కారు ప్రమాదంలో మరణించారు. మరో అమ్మాయికి గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. డెహ్రాడూన్ కాలేజీకి చెందిన విద్యార్థులు ముస్సోరీకి విహారయాత్రకు వచ్చారు. అనుకోని విధంగా ప్రమాదంలో పడి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మరోవైపు మరణవార్త తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Prashanth Varma : హనుమాన్ కోసం అదే రిఫరెన్స్ గా తీసుకున్నా..
డెహ్రాడూన్‌లోని IMS కళాశాలలో చదువుతున్నారు. నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ముస్సోరీకి విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా శనివారం ఉదయం ఈ ఘోరం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు ఉదయం 5 గంటల సమయంలో ముస్సోరీ-డెహ్రాడూన్ రహదారిపై అదుపు తప్పి పడిపోయి ఉన్నారని తెలిపారు. గాయపడిన నాన్సీ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉన్నందున ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. గత నెల ప్రారంభంలో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. కారు లోయలో పడి కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారు.