Uttar Pradesh: తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో కలతపరిచే సంఘటన చోటు వేసుకుంది. నేడు (శుక్రవారం) ఉదయం శ్రావస్తి జిల్లాలోని కైలాసపూర్ మజ్రా మనిహార్ తారా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తుల మృతదేహాలు ఇంట్లో నుండి బయటపడ్డాయి. పోలీసుల సమాచారం ప్రకారం.. మృతులు రోస్ అలీ అలియాస్ రఫిక్, అతని భార్య షహ్నాజ్, పిల్లలు తబస్సుం, మొయిన్, గుల్నాజ్‌గా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో రోస్ అలీ ముందుగా భార్య, పిల్లలను గొంతు నులిమి హత్య చేసి, అనంతరం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. రోస్ అలీ కుటుంబంతో ముంబైలో నివసించేవాడు. తన చెల్లెలి వివాహానికి సంబంధాలు చూడడానికి వారం రోజుల క్రితమే గ్రామానికి వచ్చాడు. దాదాపు ఏడాది తర్వాత స్వగ్రామానికి చేరుకున్న ఈ కుటుంబాన్ని ఇలా విషాదం చుట్టుకోవడం గ్రామస్థులను కలచివేసింది.
Vaibhav Suryavanshi Century: వైభవ్ సూర్యవంశీ తుఫాన్ సెంచరీ.. 31 బంతుల్లో 100
శుక్రవారం ఉదయం ఇంటి గది లోపల నుంచి లాక్ అయ్యి ఉండటంతో అనుమానం వచ్చిన బంధువులు, గ్రామస్తులు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని ఎవ్వరూ ఊహించలేకపోయారు. రోస్ అలీ ఫ్యాన్‌కు ఉరివేసుకోగా.. పక్కనే మంచంపై భార్య షహ్నాజ్, ముగ్గురు చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రాహుల్ భాటి తెలిపిన ప్రకారం.. గది లోపల నుంచి లాక్ అయి ఉండటం, ఘటన స్థితి దృష్ట్యా రోస్ అలీ భార్య, పిల్లలను దిండు లేదా చేతులతో గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Bhumana Karunakar Reddy: సీబీఐ విచారణ వేసే దమ్ము ఉందా.? మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్..!
ప్రాథమిక విచారణలో భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ ఈ ఘోర నిర్ణయానికి దారితీసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇతర కోణాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. ఒకే కుటుంబం ఐదుగురు ఇలా మృతిచెందడం గ్రామంలో విషాద మేఘాలు కమ్ముకున్నాయి. సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
