supreme court: రెండు నెలల క్రితం ప్రారంభమైన హలాల్ సర్టిఫికెట్ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఇవాళ ఈ అంశంపై పై కోర్టులో విచారణ కొనసాగదింది. ఉత్తరప్రదేశ్‌లో హలాల్ సర్టిఫికేట్‌పై నమోదైన కేసులో హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొనింది. గత ఏడాది నవంబర్‌లో, నకిలీ హలాల్ సర్టిఫికేట్‌లను పంపిణీ చేసినందుకు ఈ కంపెనీతో సహా అనేక సంస్థలపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Read Also: Ramakrishna: పొత్తుల కోసం బీజేపీ బెదిరింపులు, బ్లాక్ మెయిల్..?
అయితే, ఆర్థికంగా లబ్ధి పొందేందుకు ప్రజల మతపరమైన మనోభావాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తనపై సుప్రీంకోర్టులో జరుగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్‌లను క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేసింది. యూపీలో హలాల్ సర్టిఫికేట్‌ను నిషేధించడంపై కోర్టు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంతో పాటు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ నుంచి సమాధానం కోరింది.
