NTV Telugu Site icon

Janmashtami celebrations: ప్రతి పోలీస్ స్టేషన్, జైళ్లలో ఘనంగా శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు

Cm Yogi

Cm Yogi

అన్ని రిజర్వ్ పోలీస్ లైన్లు, పోలీస్ స్టేషన్లు, జైళ్లలో పవిత్రమైన శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను సాంప్రదాయ భక్తితో జరుపుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు ఇచ్చారు. దీనితో పాటు రాష్ట్రవ్యాప్తంగా కృష్ణలీలా, బల్లలు, ఊరేగింపు కార్యక్రమాల సందర్భంగా భద్రత, పరిశుభ్రత తదితర ఏర్పాట్లు చేయాలని సీఎం ప్రభుత్వ యంత్రాగానికి సూచించారు. అంతే కాకుండా రద్దీగా ఉండే ప్రదేశాల్లో తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం యోగి సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని జైళ్లలో శ్రీకృష్ణ జన్మాష్టమిని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రిజన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కరెక్షనల్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ పీవీ రామశాస్త్రి వెల్లడించారు.

READ MORE: French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ తిననివ్వడం లేదని భర్తపై భార్య ఫిర్యాదు.. గృహ హింస కేసు నమోదు

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ జన్మాష్టమి పండుగకు సంబంధించి ఆదివారం అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. శ్రీ మధురలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహిస్తున్నారని, ఇందులో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిపారు. “మధుర నగరంలో ఉన్న శ్రీ కృష్ణ జన్మభూమి/షాహీ ఈద్గా మసీదు చాలా సున్నితమైనది. ఈ ప్రదేశం కూడా ఐఎస్ఐ, పలు తీవ్రవాద సంస్థల లక్ష్యంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక నిఘా, తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఉరేగింపు సమయంలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా చూడాలి. వివాదాస్పద స్థలాల్లో బల్లల అలంకరణ, ఊరేగింపు మార్గం, కొత్త మార్గాలపై వివాదాలు తరచుగా కనిపిస్తాయి. దీనితో పాటు, సాంప్రదాయానికి భిన్నంగా కార్యక్రమాలు నిర్వహించడంపై దృష్టి సారించాలి. సాంప్రదాయేతర ఊరేగింపులు , లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం వంటిపై నిఘా ఉంచాలి.” అని యోగి

READ MORE:Man swallows keys: వ్యక్తి కడుపులో తాళంచెవి, నెయిల్ కట్టర్, కత్తి.. కారణం ఏంటంటే..

ఇతర వర్గాల మతపరమైన ప్రదేశాలలో పూజలు జరుగుతున్నప్పుడు వారి సమీపంలోకి వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం తెలిపారు. అన్యమతస్థుల ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం, ఊరేగింపులు/కార్యక్రమాల సమయంలో అభ్యంతరకర వ్యాఖ్యలు/ నినాదాలు చేయడం మొదలైన వాటిపై గతంలో చాలా చోట్ల వివాదాలు వెలుగులోకి వచ్చాయన్నారు. అలాంటి పరిస్థితి ఎక్కడా తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రక్షణ శాఖకు సూచించారు. అంతే కాకుండా ఊరేగింపు సమయంలో భద్రతను దృష్టిలో ఉంచుకుని వీడియోగ్రఫీ చేయాలన్నారు. అన్ని కార్యక్రమాల వేదికల చుట్టూ, ఊరేగింపు మార్గంలో ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేయాలని సూచించారు. ముఖ్యమైన ప్రదేశాల్లో డ్రోన్ కెమెరాలతో తనిఖీలు కూడా చేయాలన్నారు.