NTV Telugu Site icon

Uttam Kumar Reddy : రానున్న ఎన్నికల్లో 50వేల మెజార్టీ ఖాయం.. లేకుంటే రాజకీయాల్లోంచి తప్పుకుంటా

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

కోదాడలో కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ, ఎంపీ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. ఆయన తో పాటు జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, మాజీ ఎమ్మెల్యే పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. 1994లో నేను కోదాడలో పోటీ చేసిన సమయం నుంచి మంచి చెడులు చూసుకుంటూ వచ్చాననన్నారు. ఎమ్మెల్యేగా మంత్రిగా, టీపీసీసీ అధ్యక్షులుగా చేసుకుంటూ వచ్చానని, రానున్న ఎన్నికల్లో 50వేల మెజార్టీ ఖాయమన్నారు. ఈ నెలకారుకు శాసన సభ రద్దు కాబోతుందన్న ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి… రాష్ట్రపతి పాలన రాబోతుందని జోస్యం చెప్పారు. ఎమ్మెల్యే పాలనా ముగిసిన నేను ఎంపీగానే ఉంటానన్నారు. మెజార్టీ తగ్గితే రాజకీయాల నుంచి తప్పు కుంటానని ఆయన సవాల్‌ విసిరారు.

Also Read : Amigos: ఎన్టీఆర్ వచ్చేసాడు… ఎన్టీఆర్ స్పెషల్ AV అదిరిపోయింది

ఎవ్వరు అమ్ముడు పోయి ఎవరు రాజకీయాల్లో పార్టీలు మారిన వారి విజ్ఞతకే వదిలేద్దామన్నారు. ఇప్పటి కోదాడ సర్వేలో కూడా నేడు 55 శాతం కాంగ్రెస్ పార్టీకి పడనున్నాయని, రాహుల్ పాదయాత్ర దేశ సమగ్ర, ప్రజలకోసం చేసిన యాత్ర అని ఆయన అన్నారు. బీజేపీ మత పరంగా దేశాన్ని చిన్న భిన్నం చేయబోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్షల కోట్ల దోపిడీ చేసింది బీఆర్‌ఎస్‌ అని, నరంద్ర మోడీ, కేసీఆర్‌ మోసాలు ఎండగట్టెందుకే రాహుల్ పాదయాత్ర అని ఆయన అన్నారు. మోడీ, కేసీఆర్‌ చేసే మోసాలు ఎండగట్టేందుకే హాత్ సే హాత్‌ జోడే యాత్ర చేపట్ట బోతున్నామని ఆయన పేర్కొన్నారు. గడప గడపకు, ఇంటింటికి కాంగ్రెస్ అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టబోతున్నామన్నారు. ప్రస్తుతం పోలీసుల ప్రవర్తన బాగాలేదు ఎవ్వరిని వదిలే ప్రసక్తి లేదన్నారు. మునగాల సీఐ ప్రవర్తన తీవ్రంగా ఉందని ఆయన మండిపడ్డారు. డీఎస్పీలు, సీఐలు ఎమ్మెల్యేకు చెంచాగిరి చేసుకుంటూ వాళ్లకు భజన చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.