Site icon NTV Telugu

Uttam Kumar Reddy: బీఆర్ఎస్ రైతులకు క్షమాపణ చెప్పాలి

Uttamkumar Reddy

Uttamkumar Reddy

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. “బీఆర్ఎస్ నేతలకు కొద్దిగైన సిగ్గు ఉండాలి.. సిగ్గు పడాలి.. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నాము అని చెప్పి లక్ష కోట్ల ప్రాజెక్ట్ కట్టారు.. Ndsa నివేదిక చూసి సిగ్గు పడాలి వాళ్ళు.. మీరే డిజైన్ చేశారు.. మీరే కట్టారు.. మేడిగడ్డ సుందిళ్ళ నిరుపయోగంగా ఉన్నా రికార్డు స్థాయిలో పంటలు పండాయి.. అబద్ధాలు తప్పులపై బతకాలి అనుకుంటుంది బీఆర్ఎస్.. అది కుదరదు..

Also Read:Seema Haider: ప్రశ్నార్థకంగా సీమా హైదర్ భవితవ్యం! 48 గంటల్లో వెళ్లకపోతే..!

నిర్మాణం చేసిన వాళ్ళు.. చేయించిన వాళ్ళు రైతులకు ద్రోహం చేశారు.. Ndsa రేవంత్ రెడ్డో.. నేనో వేసింది కాదు.. దేశంలో బెస్ట్ ఎక్స్‌పర్ట్స్ Ndsa లో ఉన్నారు.. మీరు అధికారంలో ఉన్నప్పుడే ndsa వచ్చింది.. Brs రైతులకు క్షమాపణ చెప్పాలి.. Ndsa రిపోర్ట్ పై అధ్యయనం చేస్తాం.. వచ్చే కేబినెట్ లో ndsa పై చర్చించి చర్యలు తీసుకుంటాం.. ఎవడి అయ్య జాగీరు అని కట్టారు.. కాళేశ్వరం రైతుల కోసం కాదు జేబులు నింపుకునేందుకు కట్టారు” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

Exit mobile version