కోదాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కోదాడ, హుజుర్ నగర్ నియోజకవర్గాల విద్యార్థి, యువజన సమ్మేళన కార్యాక్రమానికి NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివసేన రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కోదాడ, హుజుర్ నగర్ నియోజకవర్గాల నుంచి నేను.. నా భార్య ఉత్తమ్ పద్మావతి పోటీ చేస్తున్నామని ఆయన ప్రకటించారు.
Read Also: AP High Court: హైకోర్టుకు చేరిన టీటీడీ కొత్త పాలక మండలి వ్యవహారం..
కోదాడ, హుజుర్ నగర్ నియోజకవర్గంలో 50 వేల మెజార్టీ తగ్గితే రాజకీయల నుంచి పూర్తిగా తప్పుకుంటాను అని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ చేశారు. నాకు పిల్లలు లేరు.. రెండు నియోజకవర్గాల ప్రజలే నా పిల్లలు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తోడుదొంగలుగా వ్యవహరిస్తూన్నారు.. నికార్సుగా వార్తలు రాస్తున్న విలేకరులపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, ఎమ్మెల్యే బోల్లం మల్లయ్యది అంటూ ఆయన విమర్శించారు.
Read Also: Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రకటించి.. ఇప్పటి వరకు ఒక్క రూపాయ కూడా ఇవ్వలేదు అని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. యూనివర్సిటీలలో రెండు వేల అధ్యాపక పోస్టులు పెండింగ్లో ఉంటే.. ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు.. సర్వేల ఆధారంగా డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులకు 4 వేల రూపాయల నిరుద్యోగ భృతి అందజేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.