మోడీ ఇంటి పేరు పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇవాళ (శుక్రవారం) సుప్రీంకోర్టు స్టే విధించింది. కాగా, దీనిపై తెలంగాణ మాజీ పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. తుది తీర్పులో కూడా సరైన నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ ఇంటి పేరు పరువు నష్టం దావా కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Read Also: High Tension: చంద్రబాబు పర్యటనలో టెన్షన్ టెన్షన్.. వైసీపీ, టీడీపీ శ్రేణుల రాళ్ల దాడులు
కేంద్ర ప్రభుత్వం గుజరాత్ ట్రయల్ కోర్టులో పరువు నష్టం కేసు వేసి.. ఆ కోర్టు జడ్జిని మార్చి రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష వేయించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో సూరత్ సెషన్స్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ కూడా బయటకు రాలేదు.. అప్పుడే లోక్ సభ నుంచి రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని తెలిపారు. అసలు శిక్ష ఎందుకు వేశారో కూడా జడ్జిమెంట్ కాపీలో లేదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీని చూసి బీజేపీ నేతలు బయపడుతున్నారు.. అందుకే ఆయన ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ భారత్‌కు కాబోయే ప్రధాని అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Ponnala Lakshmaiah: రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని వెంటనే పునరుద్ధరించాలి..
ఇది ప్రజా విజయం.. ప్రజాస్వామ్యం గెలిచింది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ విజేయుడు.. ప్రజా నాయకుడు.. ఆయనను కుయుక్తులతో అడ్డుకోవాలని అనుకోవడం అవివేకం.. పార్లమెంట్ లో మరలా రాహుల్ గాంధీ తన పదునైన వాణితో మోడీ ప్రభుత్వ ఆగడాలను ఎండగడతారు అని ఆయన వెల్లడించారు. అదానీ లాంటి “క్రోనీ కాపిటలిస్టు”లను పెంచి పోషిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే రాహుల్ గాంధీ గొంతు నొక్కే కుట్రకు పాల్పడ్డారు. తప్పుడు కేసులో సెషన్స్ కోర్టు తప్పుడు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సరిదిద్దని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల మనుగడ కోసం.. అవినీతికి వ్యతిరేకంగా
రాహుల్ గాంధీ చేసే పోరాటాన్ని ఆపాలన్నదే దుష్టశక్తుల పన్నాగం అని ఉత్తమ్ అన్నారు.
