Site icon NTV Telugu

Uttam Kumar Reddy: ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ కి కలిసి వస్తుంది..

Uttam

Uttam

రెండు నెలలు తిరగక ముందే ఇచ్చిన ఐదు హామీల్లో నాల్గింటిని కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తుంది అని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వచ్చే నెల నుండి యువనిది స్కీమ్ అమలు చేస్తాం.. హిమాచల్ ప్రదేశ్ లో గెలిచిన వెంటనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేసామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కూడా ఉద్యోగుల డిమాండ్ మేరకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పారు. తెలంగా ణలో ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక కిలో బియ్యం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంటే మిగతా 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Read Also: Amaravati Assigned Lands Case: అమరావతి భూములపై సీఐడీ కేసు.. తీర్పు రిజర్వ్‌ చేసిన హైకోర్టు

తెలంగాణలో దళిత ముఖ్యమంత్రి, డబుల్ బెడ్రూమ్, 3 లక్షల అన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేజీ టూ పీజీ అమలు చేయలేదు.. ముస్లింలకి 12 శాతం రిజర్వేషన్లు ఏమైంది.. దళిత గిరిజనలకు 3 ఎకరాలు అమలు చేయలేదు.. ఉచిత ఎరువులు అమలు చేయలేదు అని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నాం.. తెలంగాణలో మేము అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉంది అని ఉత్తమ్ చెప్పుకొచ్చారు. ఇంత దిగజారుడు, దోపిడీ ప్రభుత్వాన్ని నేను 30 ఏళ్ళ ఎమ్మెల్యే గా ఎప్పుడు చూడలేదు అని తెలిపారు.

Read Also: Griha Lakshmi Yojana: మహిళలకు కర్ణాటక సర్కారు రక్షాబంధన్ కానుక

ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ కి కలిసి వస్తుంది అని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఉప్పెనలో బీఆర్ఎస్ కొట్టుకుపోతుంది.. నేను హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తున్నా.. కోదాడ నుంచి పద్మావతి రెడ్డి పోటీ చేస్తారు అని ఉత్తమ్ స్పష్టం చేశారు. టికెట్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలనీ అధిష్టానన్ని కోరుతున్నాను.. ఏఐసీసీ నిబంధనల మేరకు… ఉదయ్ పూర్ డిక్లరేషన్ మేరకే టికెట్ల కేటాయింపు ఉంటుంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Exit mobile version