సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌లో కబ్జాకు గురైన మున్సిపాలిటీ స్థలాలను నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో 100 కోట్ల రూపాయల విలువ చేసే భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆయన ఆరోపించారు. నియోజకవర్గంలో గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, భూములు ఏదేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. సంవత్సర కాలంగా హుజూర్‌నగర్ మున్సిపాలిటీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం లేదని, జిల్లా కలెక్టర్ తన విశేష అధికారాలను ఉపయోగించి పనుల మంజూరు ఇస్తున్నారు అందులోనూ అవినీతి జరుగుతుందన్నారు.
హుజూర్‌నగర్ మున్సిపాలిటీలో జరుగుతున్న ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం పై రేపు ధర్నా ఏర్పాటు చేశా నేను కూడా పాల్గొంటానని ఆయన వెల్లడించారు. హుజూర్ నగర్ లో భూములు అన్యాక్రాంతం అవుతుంటే మున్సిపల్ కమిషనర్, పోలీసులు, ఆర్డిఓ, సబ్ రిజిస్టర్ ఎవరు వీటిపై స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.