NTV Telugu Site icon

Uttam Kumar Reddy : ఇరిగేషన్ ప్రాజెక్టులను, ఇరిగేషన్ శాఖను నాశనం చేశారు

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

ఈనెల 15న సీతారామ ప్రాజెక్టులోని 3 పంపులను ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2026 ఆగస్టు 15కు పూర్తి చేయబోతున్నామని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను, ఇరిగేషన్ శాఖను నాశనం చేశారని, ఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టె ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పదేళ్లలో 1.81లక్షల కోట్లు ఇరిగేషన్ శాఖకు ఖర్చు చేసి నామమాత్రంగా పనులు చేశారని, కాళేశ్వరంకు లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు కొత్తగా సాగులోకి తీసుకు రాలేదన్నారు ఉత్తమ్‌. పదేళ్లు అధికారంలో ఉన్నా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలేదని, మేము కొంత బడ్జెట్ కేటాయింపులు చేసి ప్రాజెక్టుల పనులు చేస్తున్నామన్నారు. రాజీవ్, ఇందిరా సాగర్ కలిసి 3505 కోట్లతో పూర్తి కావాల్సి ఉంటే 18286 కోట్లకు పెంచారు. అయినా 349 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటే ఇప్పుడు రెండింతలు పెరిగింది. భూసేకరణ కూడా పెరిగింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరా, సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కు 1500 కోట్లు ఖర్చు చేస్తే 4 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వచ్చేదన్నారు ఉత్తమ్‌.

 
Hamas-Israel War: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ల ప్రయోగం
 

అంతేకాకుండా..’రకరకాల సాకులతో ఆ ప్రాజెక్టులను వదిలి సీతారామ ప్రాజెక్టును ప్రారంభించారు. కమీషన్ల కక్కుర్తి వల్ల ఆ రాజీవ్ ఇందిరా సాగర్ ప్రాజెక్టులు వదలి వేయబడ్డాయి. 2016లో 7926 కోట్లు జీవో ఇస్తే ఇప్పుడు సుమారు 19 వేల కోట్లకు పెంచింది. కమీషన్ల కక్కుర్తి కోసమే ప్రాజెక్టుల రీడిజైనింగ్. 39 శాతం మాత్రమే బీఆర్ఎస్ ఖర్చు చేసింది. cwc పూర్తి స్థాయి అనుమతులు సీతారామ ప్రాజెక్టుకు రాలేదు. Cwc అనుమతులు మేమే తెచ్చామని బీఆర్ఎస్ చెబుతున్నారు. జనవరి 5, 2024లో సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయి. మా కృషి వల్లే 65 టీఎంసీలకు త్వరలో అప్రూవల్ రాబోతుంది. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే కేటీఆర్ హైదరాబాద్ లో పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. తాము పూర్తి చేసిన పనులకు ktr నెత్తిన నీళ్లు పోసుకున్న ఫోటోలు ప్రదర్శించారు. హరీశ్.. ktr ను ఇరికించేందుకు నెత్తిన నీళ్లు పోసుకున్నారని వ్యాఖ్యానించి ఉండొచ్చు. సీతారామ ప్రాజెక్టు పంపులకు బీఆర్ఎస్ విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. సీతారామలో ప్యాకేజీ నంబర్ 8 పనుల నిర్ణయమే బిఆర్ఎస్ హయాంలో జరగలేదు. సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరి సిస్టమ్, కాల్వల కోసం భూసేకరణ చేయలేదు.’ అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.

UP: వీళ్లు మనుషులేనా..! నమ్మి వచ్చిన ప్రియురాలిపై.. ప్రియుడు, తండ్రి దారుణం

Show comments