తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నారం…సుందిళ్ల..మేడిగడ్డ మూడే దెబ్బతిన్నాయి కదా అంటున్నారని, అంత సింపుల్ గా తీసుకుంటున్నారు బీఆర్‌ఎస్ వాళ్లని మండిపడ్డారు. సీరియస్ ప్రాబ్లం తీసుకుని.. అయితే ఏంటి అన్నట్టు మాట్లాడితే ప్రయోజనం ఉందా..?అని ఆయన ప్రశ్నించారు. కుంగిన బ్యారేజీల పై నివేదిక తెప్పిస్తామన్నారు. ఎలా పునరుద్దరణ చేయాలి అనేది ఆలోచిస్తామని, మా మార్క్ ఉండాలి అని.. కేసీఆర్ ప్రాజెక్టు డిజైన్ మార్చారన్నారు. కాళేశ్వరం పై కేసీఆర్ ది తప్పుడు నిర్ణయమని ఆయన మండిపడ్డారు.
Also Read : Sandeshkhali: సందేశ్‌ఖలీ అత్యాచార ఘటనలో టీఎంసీ నేత అరెస్ట్..
కాగ్ నివేదిక వద్దంటారు.. విజిలెన్స్ వద్దంటారు .. ndsa తో విచారణ అంటే అదేందుకు అంటారు బీఆర్‌ఎస్ వాళ్ళు అని ఆయన వ్యాఖ్యానించారు. కాగ్.. నివేదిక పర్ఫెక్ట్ గా ఉందని, నివేదిక పరిగణలోకి తీసుకుంటామన్నారు. రాష్ట్రం అప్పుల్లో..ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంది అంటే..కాళేశ్వరమే కారణమన్నారు. పాలమూరు రంగారెడ్డి కి నీటి కేటాయింపుల అంశం తేల్చాలని కేంద్రంని కోరామన్నారు. 45 tmc ఇస్తాం అన్నారని, రెండో ఫేజ్ లో 45 టీఎంసీ ఇస్తామని కేంద్రం మాటిచ్చిందన్నారు. కేఆర్‌ఎంబీకి సాగర్..శ్రీశైలం అప్పగించే ఉద్దేశం మాకు లేదని, ఇవ్వమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కరెంట్ బిల్లే రూ. 10 వేల 700 కోట్లని చెప్పారు. అఖిలపక్షానికి తాము సిద్దమన్నారు. గ్రావిటీ ద్వారా మాత్రమే ఎక్కువ ప్రయోజనం తక్కువ ఖర్చని చెప్పారు. ప్రాజెక్టుల ఖర్చు,ప్రయోజనంపై చర్చ జరగాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడిందన్నారు.
