Site icon NTV Telugu

Uttam Kumar Reddy : బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని విద్వేషాలను సృష్టిస్తుంది

Uttamkumar Reddy

Uttamkumar Reddy

సూర్యాపేట జిల్లా మోతె, నడిగూడెం మండల కేంద్రాల్లో నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని విద్వేషాలను సృష్టిస్తుందని, బీజేపీకి మరో అవకాశం ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లకు తూట్లు పడతాయని ఆయన అన్నారు. పదేళ్లుగా భాజపా ప్రచారానికే పరిమిత మయ్యిందని, బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ స్థానం కూడా రావడం కష్టమే అని ఆయన వ్యాఖ్యానించారు.

Hyderabad Metro: నేడు ఉప్పల్‌ లో ఐపీఎల్‌ మ్యాచ్‌.. మెట్రో సేవలు పొడిగింపు..

సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో 11 మంది కలిసి క్రికెట్ జట్టుగా ఏర్పడి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నామని, నా కంటే గొప్పగా కాంగ్రెస్ అభ్యర్ధి రఘువీర్ రెడ్డి పార్లమెంట్ లో ప్రజల తరపున పోరాడుతాడని ఆయన వెల్లడించారు. ప్రతి కార్యకర్త సైనికిడిలా పనిచేసి రఘువీర్ గెలుపుకు కృషి చేయాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కోరారు. రిజర్వేషన్ల పరిరక్షణ, అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్‌ను గెలిపిం చాలన్నారు.

Botsa Satyanarayana: ల్యాండ్ టైటిలింగ్ అమలు చేస్తే భూములు ఈజీగా అమ్ముకోవచ్చు..

Exit mobile version