Site icon NTV Telugu

Uttam Kumar Reddy : బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లో మేం ఒప్పుకోం

Uttam

Uttam

Uttam Kumar Reddy : బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వ నిరసన కొనసాగుతోంది. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మరోసారి తమ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఇప్పటివరకు కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేశాం. ఇంకా చేయాల్సినవి ఉంటే… అవి కూడా చేస్తాం. ఈ విషయంలో తాము ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు” అని మంత్రి స్పష్టం చేశారు. ఇక రెండు రోజుల్లో ప్రాజెక్టుపై మరింత స్పష్టత వచ్చేలా అన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే బనకచర్లపై తమ అభ్యంతరాలను కేంద్ర మంత్రులు, ముఖ్యంగా సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. “ఈ ప్రాజెక్టును మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం. త్వరలో కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తాం” అంటూ ఆయన కీలక ప్రకటన చేశారు.

Nakka Anand Babu: మీ హయాంలో.. మాస్క్ అడిగినందుకు డాక్టర్‌ను నడిరోడ్డుపై దాడి చేసి చంపారు..

మరోవైపు, బనకచర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం ముందుకు సీరియస్‌గా వెళుతోంది. పోలవరం నుంచి బనకచర్ల వరకు నీటిని తరలించే ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖకు అందించనుంది. మొత్తం రూ.81,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదిస్తోంది. ప్రాజెక్టు వల్ల రైతులకు, ప్రజలకు కలిగే లాభాలపై కేంద్రం ముందు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. గతంలో ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీలో సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ కోరిన పూర్తి వివరాలను ఏపీ నీటిపారుదల, ఆర్థిక శాఖలు సమర్పించనున్నాయి.

Thuglife : థగ్ లైఫ్‌ ను కర్ణాటకలో రిలీజ్ చేయను.. కమల్ సంచలనం..

Exit mobile version